Delhi Polls 2025: 'ఆప్-దా' నుంచి ఫిబ్రవరి 5న విముక్తి: అమిత్‌షా
ABN, Publish Date - Jan 11 , 2025 | 06:19 PM
ఒక చెడు రాజకీయనేతకు ఎన్ని అవలక్షణాలు ఉంటాయే అన్నీ కేజ్రీవాల్‌కు ఉన్నాయని, ఆయన దేశంలోనే నెంబర్ వన్ అవినీతి నేత అని అమిత్‌షా విమర్శలు గుప్పించారు.
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో 'ఆప్'ను విపత్తు (ఆప్-దా)గా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించినప్పటి నుంచి బీజేపీ నేతలు ఆ పదాన్ని విరివిగా వాడుతున్నారు. కేజ్రీవాల్ ఢిల్లీకి మాత్రమే కాకుండా ఆయన పార్టీకి (AAP) కూడా విపత్తేనని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit Shah) అన్నారు. ఒక చెడు రాజకీయనేతకు ఎన్ని అవలక్షణాలు ఉంటాయే అన్నీ ఆయనకు ఉన్నాయని, ఆయన దేశంలోనే నెంబర్ వన్ అవినీతి నేత అని విమర్శలు గుప్పించారు. శనివారంనాడిక్కడ జేఎల్ఎన్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ''జుగ్గి బస్తీ ప్రధాన్ సమ్మేళన్''లో అమిత్‌షా పాల్గొన్నారు.
Delhi Assembly Elections: బీజేపీ సీఎం అభ్యర్థి ఆయనే.. కేజ్రీ వెల్లడి
"ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదంటూ స్లమ్ వాసుల ఆవేదన, ఆగ్రహం బీజేపీ ఆలకించింది. మీ సమస్యలను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాన మంత్రి మోదీ ముందుకు తీసుకెళ్లింది. ఆ సమస్యలన్నింటికీ ఉపశమనం మా మేనిఫెస్టిలో ఉంటుంది. బీజేపీ మేనిఫెస్టో అంటే ప్రధాన మంత్రి గ్యారిటీ. 'ఆప్-దా' మేనిఫెస్టో తరహాలా ఉండదు. మేము చేసేదే చెబుతాం'' అని అమిత్‌షా అన్నారు.
ఫిబ్రవరి 5తో విపత్తు వీడుతుంది
అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగే ఫిబ్రవరి 5వ తేదీతో 'ఆప్-దా' నుంచి ప్రజలకు విముక్తి లభిస్తుందని అమిత్‌షా జోస్యం చెప్పారు. అవినీతికి వ్యతిరేకంగా ఆందోళన ప్రారంభించిన వాళ్లే (ఆప్) అవినీతి రికార్డులన్నింటినీ బద్ధలు కొట్టారని, ఢిల్లీకి 'ఆప్' ఒక విపత్తు అయితే, అరవింద్ కేజ్రీవాల్ సొంత పార్టీకి (ఆప్)కి కూడా విపత్తేనని వ్యాఖ్యానించారు.
ఇవి కూాడా చదవండి..
Ram Mandir Anniversary: రాముడు ఉంటే దేశం ఉంది, దేశం ఉంటే రాముడు ఉన్నాడు: యోగి
Chennai: ముఖ్యమంత్రి పేరుతో ‘రీచార్జ్’..
Biscuits: అయ్యప్ప భక్తులకు 5 లక్షల బిస్కెట్లు
Read Latest National News and Telugu News
Updated Date - Jan 11 , 2025 | 06:20 PM