Share News

Raind: బంగాళాఖాతంలో అల్పపీడనం.. 12 వరకు వర్షసూచన

ABN , Publish Date - Apr 08 , 2025 | 12:32 PM

ఈనెల 12వ తేదీ వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ఆవర్తనం కారణంగా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి ఈ నెల 12 వరకు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

Raind: బంగాళాఖాతంలో అల్పపీడనం.. 12 వరకు వర్షసూచన

చెన్నై: ఉపరితల ఆవర్తనం కారణంగా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి ఈ నెల 12 వరకు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం చెన్నై ప్రాంతీయ కార్యాలయం వెల్లడించింది. ఆగ్నేయ బంగాళాఖాతానికి ఆనుకునివున్న కొన్ని ప్రాంతాలో ఉపరితల ఆవర్తనం నెలకొనివుందని ఇది మంగళవారం లేదా బుధవారం దక్షిణ తూర్పు బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందన్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Supreme Court: తమిళనాడు గవర్నర్‌ ఆర్ ఎన్ రవికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ


దాని కారణంగా ఈ నెల 12వ తేదీ వరకు కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. పుదుచ్చేరి, కారైక్కాల్‌ ప్రాంతాల్లో కూడా మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. పగటి ఉష్ణోగ్రతలు ఈ నెల 10వ తేదీ వరకు కొన్ని చోట్ల సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీల వరకు పెరిగే అవకాశముందని తెలిపింది. చెన్నై నగరంలో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.


nani1,.2.jpg

అలాగే, అండమాన్‌ తీరంలో కేంద్రీకృతమైన అల్పపీడనం క్రమంగా కదులుతూ ఆంధ్రప్రదేశ్‌ వైపు పయనించవచ్చని అంచనా వేశారు. దీని ప్రభావం కారణంగా ఈ నెల 9, 10, 11 తేదీల్లో రాష్ట్రంలో వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రధానంగా కోస్తాతీర ప్రాంతాల్లో వర్షం కురుస్తుందని తెలిపింది. అలాగే, కావేరీ డెల్లా జిల్లాలైన కళ్ళకుర్చి, కడలూరు, పెంబలూరు, తంజావూరులలో అర్థరాత్రి వేళ వర్షం కురుస్తుందని పేర్కొంది.


ఈ వార్తలు కూడా చదవండి:

బిల్లుల కోసం సత్యాగ్రహం చేస్తాం

ఉదయం ఎండ .. సాయంత్రం వాన

నగరంలో కొత్తగా 6 ఎంఎంటీఎస్‌ ట్రైన్‌ లైన్లు

Read Latest Telangana News and National News

Updated Date - Apr 08 , 2025 | 12:32 PM