Pongal: పొంగల్‌ టోకెన్ల పంపిణీ ప్రారంభం

ABN, Publish Date - Jan 04 , 2025 | 10:42 AM

పొంగల్‌(Pongal) బహుమతులు అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా టోకెన్ల పంపిణీ ప్రారంభమైంది. రేషన్‌ ఉద్యోగులు శుక్రవారం నుంచి ఇంటింటికీ వెళ్లి టోకెన్లు ఇస్తున్నారు. ఈ ఏడాది పొంగల్‌ పండుగ సందర్భంగా ప్రత్యేకంగా కిట్‌ అందిస్తున్నట్టు ముఖ్యమంత్రి స్టాలిన్‌(Chief Minister Stalin) ప్రకటించిన సంగతి తెలిసిందే.

 Pongal: పొంగల్‌ టోకెన్ల పంపిణీ ప్రారంభం

చెన్నై: పొంగల్‌(Pongal) బహుమతులు అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా టోకెన్ల పంపిణీ ప్రారంభమైంది. రేషన్‌ ఉద్యోగులు శుక్రవారం నుంచి ఇంటింటికీ వెళ్లి టోకెన్లు ఇస్తున్నారు. ఈ ఏడాది పొంగల్‌ పండుగ సందర్భంగా ప్రత్యేకంగా కిట్‌ అందిస్తున్నట్టు ముఖ్యమంత్రి స్టాలిన్‌(Chief Minister Stalin) ప్రకటించిన సంగతి తెలిసిందే. సంబంధిత రేషన్‌ దుకాణాల ద్వారా అందించనున్న పొంగల్‌ బహుమతుల టోకెన్ల పంపిణి శుక్రవారం ప్రారంభమైంది.

ఈ వార్తను కూడా చదవండి: BJP: బీజేపీ తమిళనాడు ఇన్‌చార్జిగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి


nani2.2.jpg

ఈ టోకెన్లలో బహమతులు పొందాల్సిన తేది, సమయం తదితరాలున్నాయి. టోకెన్లలో తెలిపిన ప్రకారం, లబ్దిదారులు రేషన్‌ దుకాణాలకు వెళ్లి పొంగల్‌ బహుమతి(Pongal gift) పొందాలని సూచించారు. ప్రతిరోజు ఉదయం 100 మంది, మధ్యాహ్నం 100 మందికి బహుమతి అందించేలా నిర్ణయించారు. రేషన్‌ దుకాణాల వద్ద ప్రజల రద్దీని అరికట్టేలా టోకెన్ల విధానం అమలుచేస్తున్నట్లు అధికారులు తెలిపారు.


ఈవార్తను కూడా చదవండి: Nampally Court : అల్లు అర్జున్‌కు ఊరట

ఈవార్తను కూడా చదవండి: ‘మా శవయాత్రకు రండి’ వ్యాఖ్యపై కేసు కొట్టివేయండి: కౌశిక్‌రెడ్డి

ఈవార్తను కూడా చదవండి: West Godavari: ఏపీ యువకుడి దారుణ హత్య

ఈవార్తను కూడా చదవండి: Bus Accident: కేరళలో అయ్యప్ప స్వాముల బస్సు బోల్తా

Read Latest Telangana News and National News

Updated Date - Jan 04 , 2025 | 10:42 AM