Delhi New CM: 19-20 తేదీల్లో ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారం
ABN , Publish Date - Feb 14 , 2025 | 03:22 PM
ప్రధానమంత్రి ఢిల్లీకి రాగానే హోం మంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఢిల్లీ విభాగం నేతలతో సమావేశమై ముఖ్యమంత్రి ఎంపిక, మంత్రివర్గం కూర్పుపై నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. అనంతరం లెజిస్లేచర్ పార్టీ సమావేశం ఫిబ్రవరి 17న కానీ 18న కానీ ఉంటుంది.

న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఘనవిజయం సాధించిన వారం రోజులైనా ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి ఎవరు? కొత్త మంత్రివర్గ ప్రమాణస్వీకారం ఏప్పుడనే దానిపై సస్పెన్ కొనసాగుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈనెల 19, 20 తేదీల్లో కొత్త ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం జరుగనుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్, అమెరికా పర్యటన ముగించుకుని శుక్రవారం సాయంత్రం ఢిల్లీకి బయలుదేరుతారు.
Satyendra Jain: సత్యేంద్ర జైన్ ప్రాసిక్యూషన్‌ను రాష్ట్రపతి అనుమతి కోరిన హోం శాఖ
ప్రధానమంత్రి ఢిల్లీకి రాగానే హోం మంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఢిల్లీ విభాగం నేతలతో సమావేశమై ముఖ్యమంత్రి ఎంపిక, మంత్రివర్గం కూర్పుపై నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. అనంతరం లెజిస్లేచర్ పార్టీ సమావేశం ఫిబ్రవరి 17న కానీ 18న కానీ ఉంటుందని, ఫిబ్రవరి 19న కానీ 20న కానీ ప్రమాణస్వీకారం ఉంటుంది.
షార్ట్‌లిస్ట్‌లో 15 పేర్లు
పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, గెలిచిన 48 మంది ఎమ్మెల్యేలలో 15 మంది పేర్లను బీజేపీ షార్ట్‌లిస్ట్ చేసింది. వీరిలో 9 మందిని సీఎం, అసెంబ్లీ స్పీకర్, క్యాబినెట్ స్థానాలకు ఎంపిక చేయనుంది. కాగా, సీఎం రేసులో న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి కేజ్రీవాల్‌ను ఓడించిన పర్వేష్ వర్మ మొదటి స్థానంలో ఉన్నారు. తక్కిన వారిలో పార్టీ ఢిల్లీ విభాగం చీఫ్ వీరేంద్ర సచ్‌దేవ, బన్సూరి స్వరాజ్, సతీష్ ఉపాధ్యాయ్ తదితరులు ఉన్నారు. ఫిబ్రవరి 5న 70 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 48 స్థానాలకు బీజేపీ సొంతం చేసుకుంది. మరోసారి అధికారంలోకి రావాలనుకున్న ఆప్ 22 స్థానాలకే పరిమితమైంది.
ఇవి కూడా చదవండి...
PM Modi: ప్రధాని మోదీ డొనాల్డ్ ట్రంప్ సమావేశం.. అక్రమ వలసదారుల విషయంపై మోదీ కీలక వ్యాఖ్యలు
Chennai: కమల్‌హాసన్‌తో ఉప ముఖ్యమంత్రి భేటీ..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.