Jammu and Kashmir: కథువాలో ఎన్‌కౌంటర్.. ఉగ్రవాదులను చుట్టుముట్టిన బలగాలు
ABN , Publish Date - Mar 23 , 2025 | 09:21 PM
హిరానగర్ సెక్టార్‌లోని అంతర్జాతీయ సరిహద్దు సమీపంలోని సన్యాల్ గ్రామంలో అనుమానిత ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో బలగాలు సెర్చ్ ఆపరేషన్ జరపడంతో ఇరువర్గాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి.

శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోన కథువాలో ఉగ్రవాదులు ఆదివారం సాయంత్రం మరోసారి రెచ్చిపోయారు. అయితే భద్రతా బలగాలు సకాలంపై ఉగ్రవాదుల చొరబాటు యత్నాన్ని తిప్పికొట్టారు. ఈ నేపథ్యంలో బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. హిరానగర్ సెక్టార్‌లోని అంతర్జాతీయ సరిహద్దు సమీపంలోని సన్యాల్ గ్రామంలో అనుమానిత ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో బలగాలు సెర్చ్ ఆపరేషన్ జరపడంతో ఇరువర్గాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి.
Attack: భద్రతా దళాల వాహనాన్ని పేల్చేసి..ఆపై కాల్పులు జరిపిన మావోయిస్టులు
అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలోని అటవీ ప్రాంతంలో జమ్మూకశ్మీర్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్, సైన్యం, సీఆర్‌పీఎఫ్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టాయి. అనుమానిత సాయుధల కదలికలపై స్థానికుల సమాచారం మేరకు ఈ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. సుమారు ఐదుగురు ఉగ్రవాదులు ఈ ప్రాంతంలో ఉన్నట్టు బలగాలు అనుమానిస్తున్నాయి. గాలింపు చర్యలు కొనసాగుతున్నట్టు అధికారుల తెలిపారు.
కొద్దికాలంగా సద్దుమణిగినట్టు కనిపించినా ఇటీవల కాలంలో తిరిగి ఉగ్రవాదుల చొరబాటు యత్నాలు చోటుచేసుకుంటున్నాయి. మార్చి 17న కుప్వారా జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఒక పాక్ టెర్రరిస్టును భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఇటీవలే కథువా జిల్లాలో ముగ్గురు పౌరులను టెర్రరిస్టులు హతమార్చారు. వీరిలో 14 ఏళ్ల బాలుడు కూడా ఉన్నాడు.
ఇవి కూడా చదవండి..