Chhattisgarh Maoist Encounter: నేషనల్ పార్కులో ఎదురు కాల్పులు.. 12 మంది మావోయిస్టుల మృతి..

ABN, Publish Date - Feb 09 , 2025 | 11:43 AM

Chhattisgarh Maoist encounter: వరుస ఎన్‌కౌంటర్లతో మావోయిస్టు పార్టీకి కోలుకోలేని ఎదురుదెబ్బ తగులుతోంది. తాజా ఆదివారం ఉదయం బీజాపూర్ జిల్లాలో భద్రతాబలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 12 మంది మావోలు మృతి చెందారు. ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి.

Chhattisgarh Maoist Encounter: నేషనల్ పార్కులో ఎదురు కాల్పులు.. 12 మంది మావోయిస్టుల మృతి..
Encounter in Chattisgarh

ఛత్తీస్‌గఢ్: వరుస ఎన్‌కౌంటర్లతో (Encounter) మావోయిస్టు పార్టీ (Maoist Party)కి కోలుకోలేని ఎదురుదెబ్బ తగులుతోంది. తాజాగా ఆదివారం ఉదయం బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. నేషనల్ పార్కు (National Park)లో ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. కాగా ఈ నెల 6న ఛత్తీస్‌గడ్‌లోని నారాయణపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలకు మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. పలువురు గాయపడ్దారు. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం ఉదయం నుంచి మాధ్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.

ఈ వార్త కూడా చదవండి..

పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేస్తూ.. యువకుడు మృతి..


కాగా.. భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్‌లో భాగంగా భారీ ఎత్తున వరుసగా ఎన్‌కౌంటర్లు చేస్తున్నారు. గత ఐదురోజుల క్రితం బీజాపూర్ జిల్లా గంగలూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఆ ఎన్‌కౌంటర్‌లో ఎనిమిది మంది మావోయిస్టుల మృతి చెందినట్లు పోలీసు వర్గాలు ధృవీకరించాయి. ఆపరేషన్ కగార్ పేరుతో చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు కంచుకోటగా ఉన్న దండకారణ్యం మొత్తాన్ని భారీగా భద్రతా బలగాలు నలువైపులా చుట్టుముట్టి వరుసగా ఎన్‌కౌంటర్లు చేస్తున్నారు. జనవరి 16న బీజాపూర్ జిల్లాలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 12 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోగా.. అగ్రనేతలు తప్పించుకున్నట్లు బస్తర్ ఐజి పి.సుందర్‌లాల్‌ తెలిపారు.


అలాగే జనవరి 21 గరియాబాద్ ఎన్‌కౌంటర్‌లో 16 మంది మావోయిస్టులు మృతి చెందారు. తెలంగాణ సరిహద్దుగా ఉన్న బీజాపూర్ జిల్లాలోని పామేడు, బాసగూడ, ఊసురు గంగ పోలీస్‌స్టేసన్ పరిధిల్లోనే ఎక్కవగా సెర్చ్ ఆపరేషన్‌ కొనసాగుతోంది. తెలంగాణ సరిహద్దు సౌత్ బస్తర్ ప్రాంతంలో మావోయిస్టు సుప్రీం కమాండర్‌గా ఉన్న మడవి హిడ్మాతో పాటు తెలంగాణ కార్యదర్శి ఉన్నట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. దీంతో భారీగా సెర్చ్ ఆపరేషన్‌ కొనసాగుతోంది. నిత్యం భద్రతాబలాగాలు, మావోయిస్టులకు మధ్య జరుగుతున్న కాల్పులు, ప్రతి కాల్పులతో దండకారణ్యం ఒక యుద్ధ భూమిగా మారిన పరిస్థితి.


ఈ వార్తలు కూడా చదవండి..

దస్తగిరి ఫిర్యాదు కేసుపై విమర్శలకు తలెత్తిన విచారణ

జగన్‌కు సీఎం చంద్రబాబు కౌంటర్

శ్రవారిని దర్శించుకున్న శ్రద్ధా శ్రీనాథ్

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Feb 09 , 2025 | 12:21 PM