EPF Withdrawal Simplified: ఈపీఎఫ్ విత్‌డ్రా మరింత సులువు
ABN, Publish Date - Apr 04 , 2025 | 06:22 AM
ఈపీఎఫ్‌వో ఉద్యోగులకు నగదు విత్‌డ్రా ప్రక్రియను మరింత సులభతరం చేసింది ఇకపై క్యాన్సిల్డ్ చెక్ అప్‌లోడ్ చేయడం బ్యాంకు ఖాతా యాజమాన్యం ధ్రువీకరణ అవసరం ఉండదు

ఇకపై క్యాన్సిల్డ్ చెక్ అప్‌లోడ్ అవసరం లేదు
బ్యాంకు ఖాతాకు కంపెనీ ధ్రువీకరణ అక్కర్లేదు
క్లెయిమ్‌ల వేగవంతానికి ఈపీఎఫ్‌వో చర్యలు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 3: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎ్‌ఫవో) ఉద్యోగులకు పెద్ద ఉపశమనం కలిగించింది. ఆన్‌లైన్‌లో నగదు విత్‌డ్రా విధానాన్ని ఇకపై మరింత సులభతరం చేసింది. ఆన్‌లైన్‌లో నగదు విత్‌డ్రా కోసం దరఖాస్తు చేసే సమయంలో క్యాన్సిల్డ్ చెక్ అప్‌లోడ్ చేసే ప్రక్రియను తొలగించింది. అదేవిధంగా బ్యాంకు ఖాతాను యాజమాన్యం ధ్రువీకరించవలసిన అవసరం లేదని స్పష్టం చేసింది. దీంతో దాదాపు 8 కోట్ల మంది సభ్యులకు ప్రయోజనం చేకూరనుంది. క్లెయిమ్‌ల పక్రియను వేగవంతం చేయడానికి, ఉద్యోగులు, యజమానులకు సౌకర్యవంతంగా ఉండటానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ గురువారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ చర్యలతో క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రక్రియ క్రమబద్ధీకరణతోపాటు, క్లెయిమ్‌ల తిరస్కరణలపై ఫిర్యాదులు కూడా తగ్గుతాయని తెలిపింది. యూఏఎన్‌తో బ్యాంకు ఖాతా అనుసంధానం చేసే క్రమంలో ఆ బ్యాంకు ఖాతా వివరాల ధ్రువీకరణ పూర్తవుతుంది కాబట్టి అదనపు డాక్యుమెంట్లు ఇక అవసరం ఉండదని స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి
Supreme Court Orders: హెచ్‌సీయూ భూములపై తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్‌కు సుప్రీం ఆదేశాలు
Vijay Kumar ACB Questioning: రెండో రోజు విచారణకు విజయ్ కుమార్.. ఏం తేల్చనున్నారో
Read Latest National News And Telugu News
Updated Date - Apr 04 , 2025 | 06:24 AM