Former CM: మాజీ సీఎం శపథం.. వచ్చే పండుగ నాటికి డీఎంకే సమాధి
ABN, Publish Date - Jan 16 , 2025 | 11:03 AM
వచ్చే యేడాది సంక్రాంతికల్లా డీఎంకేని కూకటి వేళ్లతో సహా పెకలిస్తామని, రాష్ట్రం నుంచి ఆ పార్టీని తరిమికొడతామని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి(Former Chief Minister Edappadi Palaniswami) శపథం చేశారు.
చెన్నై: వచ్చే యేడాది సంక్రాంతికల్లా డీఎంకేని కూకటి వేళ్లతో సహా పెకలిస్తామని, రాష్ట్రం నుంచి ఆ పార్టీని తరిమికొడతామని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి(Former Chief Minister Edappadi Palaniswami) శపథం చేశారు. అన్నాడీఎంకే సేలం సబర్బన్ శాఖ ఆధ్వర్యంలో వీరపాండి అసెంబ్లీ నియోజకవర్గపరిధిలోని పుత్తూరు ప్రాంతంలో బుధవారం ఉదయం నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ఓ రైతు బిడ్డగా తాను సంక్రాంతి(Sankranti) వేడుకల్లో పాల్గొనటం తనకెంతో ఆనందంగా ఉందని,
ఈ వార్తను కూడా చదవండి: Cyber criminals: సైబర్ నేరగాళ్ల కొత్త ఎత్తుగడ.. గూగుల్ సెర్చ్ చేస్తున్న వారే టార్గెట్
రాష్ట్రంలో డీఎంకే(DMK) వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని, వచ్చే పొంగల్ నాటికి ఆ పార్టీని కూకటి వేళ్లతో కూల్చిపడేస్తామని అన్నారు. తన హయాంలో ప్రారంభించిన పశుసంవర్థక పరిశోధనా కేంద్రాన్ని మూడేళ్లుగా ప్రారంభించకుండా కాలయాపన చేసిన డీఎంకే ప్రభుత్వం శాసనసభలో ఆ విషయాన్ని తాను ప్రస్తావిస్తాననే భయంతో ప్రారంభోత్సవం జరిపిందని చెప్పారు. పార్టీ శ్రేణులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ఈపీఎస్ వచ్చే యేడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ కార్యకర్తలంతా వెంటనే ప్రచార కార్యక్రమాలను ప్రారంభించాలని పిలుపునిచ్చారు.
ఈవార్తను కూడా చదవండి: యువతిని రక్షించబోయి హత్యకు గురయ్యాడా?!
ఈవార్తను కూడా చదవండి: KTR: అరెస్టు చేస్తారా?
ఈవార్తను కూడా చదవండి: పుప్పాలగూడలో జంట హత్యల కలకలం
ఈవార్తను కూడా చదవండి: పవర్‌ప్లాంటు స్ర్కాప్ కుంభకోణంపై నీలినీడలు !
Read Latest Telangana News and National News
Updated Date - Jan 16 , 2025 | 11:03 AM