Farmers: దేశ ప్రజలకు అదిరిపోయే వార్త
ABN , Publish Date - Apr 15 , 2025 | 04:55 PM
Farmers: దేశంలోని రైతులకు అదిరిపోయే శుభవార్త చెప్పిందీ భారత వాతావరణ శాఖ. ఈ ఏడాది పుష్కలంగా వర్షాలు పడతాయని పేర్కొంది. దీంతో తెలుగు రాష్ట్రాలతోపాటు పలు రాష్ట్రాల్లో వర్ష పాతం సమృద్ధిగా కురుస్తోందని వివరించింది. అయితే తమిళనాడుతోపాటు ఈశాన్య రాష్ట్రాల్లో వర్షం కాస్తా తక్కువగా కురుస్తోందని భారత వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: దేశంలోని అన్నదాతలకు భారత వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. ఈ ఏడాది అంటే.. 2025లో దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడతాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ మేరకు భారత వాతావరణ శాఖ మంగళవారం ఒక ప్రకటన చేసింది. 2025 ఏడాదిలో దీర్ఘ కాల వర్షపాత నమోదు వివరాలు ఈ సందర్భంగా వాతావరణ శాఖ వెల్లడించింది. నైరుతి రుతుపవనాల వల్ల జూన్ నుంచి సెప్టెంబర్ వరకు సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవుతుందని తెలిపింది.
ఈ నైరుతి రుతుపవనాల వల్ల దేశం మొత్తం దీర్ఘకాల సగటు వర్షపాతం 105 శాతంగా ఉంటుందని అంచనా వేసినట్లు పేర్కొంది. ఈ రుతుపవనాల కారణంగా.. తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణతోపాటు మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, కర్ణాటకలలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ చెప్పింది.
ఇక తమిళనాడు, ఈశాన్య రాష్ట్రాల్లో సాధారణం కంటే.. తక్కువ స్థాయిలో వర్షపాతం నమోదువుతుందని పేర్కొంది. అయితే 1971-2020 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా సీజన్ వర్షపాతం దీర్ఘకాల సగటు 87 సెం.మీగా నమోదైందని భారత వాతావరణ శాఖ గణాంకాలతో సహా సోదాహరణగా వివరించింది.
మరోవైపు ఈ ఏడాది వేసవి తీవ్రత అధికంగా ఉంటుందని ఇప్పటికే వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో సాగు, తాగు నీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో మంచి నీటి కోసం ప్రజలు ఇక్కట్లు పడుతోన్నారు. నదులలో నీరు సైతం అవిరై పోయింది. గాలిలో తేమ కూడా లేదని దీంతో ఉక్కపోత తీవ్రత కాస్తా ఎక్కువగా ఉంటుందని ఇప్పటికే వాతావరణ శాఖ వెల్లడించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
Errabelli Dayakar Rao: అలా అయితే.. రాజకీయాల నుంచి తప్పుకొంటా..
PM Modi: ఏపీకి ప్రధాని మోదీ.. ఎప్పుడంటే..
వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ
For National News And Telugu News