CM Announcement: నెలకు రూ. 20 వేలు పెన్షన్.. శుభవార్త చెప్పిన సీఎం

ABN, Publish Date - Jan 13 , 2025 | 05:37 PM

CM Announcement: ప్రజలకు ముఖ్యమంత్రి శుభవార్త చెప్పారు. ప్రజలకు ప్రతి నెల రూ. 20 వేలు పెన్షన్‍గా ఇవ్వాలని నిర్ణయించారు. ఈ ఏడాది ఈ జనవరి 1వ తేదీని అందజేస్తామని సీఎం ప్రకటించారు.

భువనేశ్వర్, జనవరి 13: ఒడిశా ప్రజలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాంఝీ శుభవార్త తెలిపారు. ఎమర్జెన్సీ సమయంలో జైళ్లకు వెళ్లిన వారికి నెలకు రూ.20 వేలు పెన్షన్ అందజేస్తామని ఆయన వెల్లడించారు. వారికి ఉచిత వైద్య సదుపాయాన్ని సైతం కల్పిస్తామని చెప్పారు. 2025, జనవరి 01వ తేదీ నుంచి వారికి ఈ సదుపాయాలు అందిస్తామని ఆయన వెల్లడించారు. ఈ మేరకు ఒడిశా హోం మంత్రిత్వ శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎమర్జెన్సీ సమయంలో మెయింట్‍నెస్ ఆఫ్ ఇంటర్నెల్ సెక్యూరిటీ, డిఫెన్స్ ఆఫ్ ఇండియాన్ రూల్, లేదా ఇంటర్నెల్ సెక్యూరిటీ ఆఫ్ ఇండియా రూల్స్ కింద అరెస్ట్ అయిన వారికి ఈ సదుపాయాలు అందజేయనున్నట్లు ఈ ఏడాది జనవరి 2వ తేదీన సీఎం మోహన్ చరణ్ మాంజీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎమర్జెన్సీ సమయంలో జైళ్లకు వెళ్లి.. నేటికి బ్రతికి ఉన్న వారికి పెన్షన్ తో పాటు ఈ వైద్య సదుపాయాలు అందుతాయని వివరించారు.


1975, జూన్ 25వ తేదీన దేశ వ్యాప్తంగా నాటి ప్రధాని ఇందిగా గాంధీ ఎమర్జెన్సీ విధించారు. 1977, మార్చి 21వ తేదీ వరకు ఈ ఎమర్జెన్సీ కొనసాగింది. ఈ కాల వ్యవధిలో దేశ వ్యాప్తంగా లక్షలాది మందిని ఇందిరా ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసింది. అనంతరం వారందరిని జైళ్ళకు తరలించింది. దాదాపు కొన్న నెలల పాటు సాగిన ఈ ఎమర్జెన్సీ వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ ఎమర్జెన్సీ కారణంగా.. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వంలోని పలువురు మంత్రులు సైతం జైళ్లకు వెళ్లిన సంగతి తెలిసిందే. అంతేకాదు.. ఆ సమయంలో వారిని అక్రమంగా నిర్భందించారంటూ ఇటీవల ఎమర్జెన్సీ నాటి రోజులను పలువురు కేంద్ర మంత్రులు గుర్తు చేసుకున్న విషయం విధితమే.

Also Read: మహా కుంభమేళలో విగ్రహం కారణంగా రేగిన వివాదం

Also Read: కోడి పందాల్లో గెలవాలంటే.. ఇలా చేయండి

Also Read: పందెం కోళ్లు ఎన్ని రకాలో తెలుసా..?


మరోవైపు గతేడాది మే, జూన్ మాసాల్లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. వాటితో పాటు ఒడిశా, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రాష్ట్ర ఓటరు.. బీజేపీకీ పట్టం కట్టాడు. దీంతో దశాబ్దాల పాటు సాగిన బిజు జనతాదళ్ పార్టీ పాలనకు ఫుల్ స్టాప్ పడింది. ఆ క్రమంలో మోహన్ చరణ్ మాంఝీ సారథ్యంలో బీజేపీ ప్రభుత్వం కొలువు తీరింది. అందులోభాగంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను సైతం మాంఝీ ప్రభుత్వం వరుసగా ఒకదాని తర్వాత ఒకటి అమలు చేసుకొంటూ వస్తోంది. ఎమర్జెన్సీ సమయంలో.. జైళ్లకు వెళ్లిన ఒక్కొక్కరికి రూ. 20 వేల నగదు ప్రతి నెల పెన్షన్ గా అందజేయాలని ఒడిశాలోని బీజేపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది.

For National news And Telugu News

Updated at - Jan 13 , 2025 | 06:23 PM