Share News

Bird Flu: పిల్లులకీ బర్డ్ ఫ్లూ.. నెక్ట్స్ మనుషులకేనా.. షాకింగ్ విషయాలు..

ABN , Publish Date - Feb 27 , 2025 | 07:16 PM

Bird Flu: బర్డ్ ఫ్లూ పక్షులకే కాదు.. మనుషులకూ వ్యాప్తిస్తుందా.. ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజా వైరస్ రూపాంతరం చెంది మనుషుల్లోనూ విస్తరించే అవకాశం ఉందా.. పిల్లులకు బర్డ్ సోకడం వెనుక ఉన్న కారణ ఏంటి.. శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు.. సంచలన విషయాలు మీకోసం..

Bird Flu: పిల్లులకీ బర్డ్ ఫ్లూ.. నెక్ట్స్ మనుషులకేనా.. షాకింగ్ విషయాలు..
Bird Flu

భోపాల్, ఫిబ్రవరి 27: ఇప్పటికే యావత్ భారతదేశాన్ని బర్డ్ ఫ్లూ మహమ్మారి భయపెడుతుండగా.. ఇప్పడు మరో అప్‌డేట్ వచ్చింది. ఈ వైరస్ కేవలం కోళ్లలోనే కాదు.. పిల్లులకూ వ్యాప్తిస్తోందని వైద్యులు నిర్ధారించారు. తాజాగా పిల్లికి బర్డ్ ఫ్లూ సోకిన కేసు మధ్యప్రదేశ్‌లోని చింద్వారా జిల్లాలో వెలుగు చూసింది. పిల్లులలో ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజా వైరస్(H5N1) తొలి కేసు అని నిపుణులు చెబుతున్నారు. పిల్లులకు సోకిన ఈ వైరస్.. మనుషులకు కూడా సోకుతుందేమోనని ఆందోళనలు పెరుగుతున్నాయి.


‘H5N1 క్లాసికల్‌గా ఏవియన్ వైరస్. కానీ కొన్ని ఉత్పరివర్తనలు ఇతర జంతువులు, పక్షుల్లో వ్యాప్తిం చెందడానికి అవకాశాన్ని కల్పిస్తాయి. కోవిడ్-19 మాదిరిగానే.. ఇది కూడా తన ఆకృతి మార్చుకునే అవకాశం ఉన్నందున ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి.’ అని పలువురు నిపుణులు చెబుతున్నారు. అయితే, ICAR-NIHSAD, కేంద్ర ప్రభుత్వ పశుసంవర్ధక శాఖ శాస్త్రవేత్తలు.. ఈ జనవరిలో నాగ్‌పూర్ సరిహద్దులో ఉన్న చింద్వారాలో పిల్లులకు బర్డ్ ఫ్లూ సోకిన కేసులను గుర్తించారు. గత సంవత్సరం డిసెంబర్‌లో కూడా కొన్ని పిల్లులు బర్డ్ ఫ్లూ తో మరిణించినట్లు చెబుతున్నారు.


శాస్త్రీయ బృందం ఈ వైరస్ 2.3.2.1a వంశానికి చెందినదిగా గుర్తించింది. ఇది భారతదేశం అంతటా పౌల్ట్రీలో వ్యాప్తికి కారణమైన H5N1 కి చెందినదని పేర్కొన్నారు. ఈ వైరస్ సోకిన పిల్లులన్నింటిలో అధిక జ్వరం, ఆకలి లేకపోవడం, నీరసం వంటి లక్షణాలు కనిపించాయని, నమూనా సేకరించిన ఒకటి నుండి మూడు రోజుల్లోపు అవి చనిపోతాయని నిపుణుల అధ్యయనంలో పేర్కొన్నారు. పిల్లులలో కనిపించే వైరస్‌లో 27 ఉత్పరివర్తనలు గుర్తించారు. మానవులతో సహా పెంపుడు జంతువులు, అడవి పక్షులు, క్షీరదాలపై నిఘా అవసరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ వైరస్ పక్షులతో పాటు.. జంతువుల్లోనూ విస్తరించడంతో జాగ్రత్త వహరించాల్సిన అవసరం ఉందన్నారు.


వైద్య నిపుణులు ఏమంటున్నారంటే..

‘మానవులకు ఈ వైరస్ సోకడం చాలా అరుదు అయినప్పటికీ.. వైరస్ మనుషులకు, మనుషుకు మధ్య వ్యాప్తి చెందేందుకు అనువుగా ఉంటుందనే విషయాన్ని గుర్తించాలి. ప్రస్తుతానికి మనుషులకు ఈ వైరస్ వ్యాప్తి చెందనప్పటికీ.. వైరస్‌లో కొనసాగుతున్న మార్పుల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది.’ అని వైరాలజిస్ట్‌లు చెబుతున్నారు. ‘H5N1 మనుషులకు కొత్త. దానిని ఎదుర్కొనే రోగనిరోధక శక్తి మనుషులకు లేదు. ప్రస్తుతం పక్షుల నుంచి పక్షులకు వ్యాప్తి చెందుతున్న ఈ వైరస్.. మనుషుల నుంచి మనుషులకు వ్యాప్తి చెందేలా పరిణామం చెందితే.. పరిస్థితి ఆందోళనకరంగా ఉంటుంది’ అన్నారు.

Updated Date - Feb 27 , 2025 | 07:17 PM