India-Pakistan: అణు స్థావరాల జాబాతాను మార్చుకున్న భారత్-పాక్
ABN , Publish Date - Jan 01 , 2025 | 08:37 PM
ఒక దేశం అణు కేంద్రాలపై మరొక దేశం దాచి చేయకూడదనే ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా ఈ జాబితాను పరస్పరం అందించుకున్నట్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది.
న్యూఢిల్లీ: భారత్, పాకిస్థాన్ తమ దేశాల్లోని అణు స్థావరాల జాబాతాను పరస్పరం బుధవారంనాడు మార్పిడి చేసుకున్నాయి. ఏటా ఈ సంప్రదాయం కొనసాగుతోంది. ఒక దేశం అణు కేంద్రాలపై మరొక దేశం దాచి చేయకూడదనే ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా ఈ జాబితాను పరస్పరం అందించుకున్నట్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA)తెలియజేసింది. ఏకకాలంలో ఈ ప్రక్రియ పూర్తయినట్టు పేర్కొంది.
Manmohan Singh: మన్మోహన్ స్మారకం కోసం రెండు స్థలాలను ప్రతిపాదించిన కేంద్రం
''దౌత్య మార్గాల ద్వారా అణుస్థావరాల జాబాతాను ఇండియా, పాకిస్థాన్ ఏకకాలంలో న్యూఢిల్లీ, ఇస్లామాబాద్‌లో మార్పిడి చేసుకున్నాయి. అణు స్థాపరాలపై దాడులు జరపకుండా ఇరుదేశాల మధ్య ఉన్న ఒప్పందానికి అనుణంగా ఈ మార్పిడి జరిగింది'' అని ఎంఈఏ తెలిపింది. రెండు దేశాలు సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం ఇది 34వ సారి. 1988 డిసెంబర్ 31 ఇరుదేశాల మధ్య ఈ మేరకు ద్వైపాక్షిక ఒప్పందం జరిగింది. 1992 జనవరి 1 నుంచి ఏటా అదేరోజు అణుసమాచారాన్ని ఉభయదేశాలు అందజేసుకుంటున్నాయి.
ఇవి కూడా చదవండి..
PM Kisan Scheme : 6 వేలు కాదు.. 10 వేలు
UP: యూపీలో దారుణం.. ఐదుగురు మహిళల హత్య
Read More National News and Latest Telugu News