Share News

Sri Ramulu: తగ్గేదెలే..‘గాలి’ అక్రమాలు బయటపెడతా..

ABN , Publish Date - Jan 24 , 2025 | 11:49 AM

‘నన్ను ఒక రౌడీలా చిత్రీకరించాలని చూస్తున్నావు.. నీ మాటలు ఎవరూ నమ్మరు. నా వల్ల నీవు ఎదిగావో.. నీవల్ల నేను ఎదిగానో జనానికి తెలుసు’ అని మాజీ మంత్రి శ్రీరాములు గాలి జనార్దన్‌ రెడ్డి(Gali Janardhan Reddy)పై ధ్వజమెత్తారు.

Sri Ramulu: తగ్గేదెలే..‘గాలి’ అక్రమాలు బయటపెడతా..

- సరైన సమయంలో అన్నీ వెల్లడిస్తా..

- నా గురించి అందరికీ బాగా తెలుసు

- రౌడీలా చిత్రీకరించాలని చూస్తున్నారు..

- మాజీ మంత్రి శ్రీరాములు ధ్వజం

బళ్లారి(బెంగళూరు): ‘నన్ను ఒక రౌడీలా చిత్రీకరించాలని చూస్తున్నావు.. నీ మాటలు ఎవరూ నమ్మరు. నా వల్ల నీవు ఎదిగావో.. నీవల్ల నేను ఎదిగానో జనానికి తెలుసు’ అని మాజీ మంత్రి శ్రీరాములు గాలి జనార్దన్‌ రెడ్డి(Gali Janardhan Reddy)పై ధ్వజమెత్తారు. గురువారం బళ్లారి(Ballari) హావంబావి సమీపంలోని తన నివాసంలో విలేకరుల సమావేశంలో శ్రీరాములు(Sri Ramulu) మాట్లాడారు. రెండు రోజుల క్రితం బెంగళూరులో బీజేపీ హై-మిటీ సమావేశం నిర్వహించింది. ఇందులో తాపే సండూరు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి విజయానికి పనిచేయలేదని పేర్కొంది.

ఈ వార్తను కూడా చదవండి: Mahakumbh Mela : ధర్మ పరిరక్షణకు ‘సనాతన బోర్డు’


కానీ ఇది ముమ్మాటికి అసత్యం తాను పార్టీ అభ్యర్థి కోసం పని చేశానన్నారు. ఈ అసత్యపు ప్రచారం గాలి జనార్దన్‌రెడ్డి సృష్టిస్తున్నారని, తాను బీజేపీ(BJP)లో ముందు నుంచి ఉన్నానని, పార్టీ కోసం ఎంతో కష్టపడ్డానన్నారు. 14 ఏళ్లగా ఆయన జైల్లో ఉన్నాడు, ఆయనకు ఇక్కడ ప్రాధాన్యం తగ్గింది. అందుకే అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. పార్టీలో తనకంటూ ప్రత్యేక స్థానం ఉందన్నారు. ఓడిపోయినా పార్టీ వీడలేదని, ఎస్టీ నాయకు డిగా ప్రజలు ఆదరిస్తున్నా రన్నారు. ప్రతి నియోజక వర్గంలో గ్రూపులు పెట్టడం, పార్టీ వాళ్లనే ఓడించేందుకు జనార్దన్‌రెడ్డి(Janardhan Reddy) పనిచేశారని ఆరోపించారు.


pandu1.2.jpg

కంప్లిలో తన అల్లుడు సురేష్‏బాబును ఓడించేందుకు గాలి గ్రూపు రాజకీయాలు చేశారన్నారు. పార్టీలో సమస్యలు సర్దుకుంటాయి.. కానీ జనార్దన్‌రెడ్డితో మనస్పర్థలు మరచిపోలేనన్నారు. పేదలకు ఎప్పుడూ అండగా ఉంటానన్నారు. ముండ్లూరు, సూర్యనారాయణరెడ్డి కలిసి మీ మామను హత్య చేయించారని గాలి జనార్దన్‌రెడ్డి ఆరోపించారని ప్రశ్నించగా సూర్యనారాయణరెడ్డి డబ్బులు ఇవ్వలేదు. ఇది కేవలం జనార్దన్‌రెడ్డి కల్పన అని మాత్రమేనన్నారు.


ఈవార్తను కూడా చదవండి: కిడ్నీ మార్పిడి జరిగిందెక్కడ?

ఈవార్తను కూడా చదవండి: నేనే చంపాను.. మీ వద్ద సాక్ష్యాలున్నాయా?

ఈవార్తను కూడా చదవండి: భర్త దొంగ అని తెలిసి షాక్‌.. బిడ్డల్ని చంపి.. తల్లి ఉరి

ఈవార్తను కూడా చదవండి: CM Revanth Reddy: దావోస్ ధమాకా!

Read Latest Telangana News and National News

Updated Date - Jan 24 , 2025 | 11:49 AM