Share News

Arvind Kejriwal: కేజ్రీవాల్ మరో కీలక హామీ

ABN , Publish Date - Jan 04 , 2025 | 02:44 PM

కాంగ్రెస్ పార్టీపై కేజ్రీవాల్ విమర్శలు గుప్పిస్తూ, ఆ పార్టీ ప్రజలకు దూరమైందని, ప్రజాసమస్యల పరిష్కారంలో చిత్తశుద్ధి కొరవడిందని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ రెండు ప్రజావిశ్వాసం కోల్పోయినందున వారు కూటమిగా ఏర్పడాలని సూచించారు.

Arvind Kejriwal: కేజ్రీవాల్ మరో కీలక హామీ

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), బీజేపీ (BJP) మధ్య రాజకీయాలు వేడెక్కుతున్నాయి. బీజేపీ కేవలం ప్రతికూల విమర్శలు, ఇతరులను అవమానించడం ద్వారా మాత్రమే ఎన్నికల్లో గెలవాలనుకుంటోందని, ఆప్ మాత్రం పదేళ్లు చేసిన పనుల ఆధారంగా ఓట్లు కోరుతోందని ఆప్ కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) అన్నారు. ఢిల్లీ వాసులు తప్పుడు నీటి బిల్లులు వస్తే వాటిని కట్టవద్దని, ఆప్ ప్రభుత్వం 2025లో తిరిగి అధికారంలోకి రాగానే ఆ బిల్లులను రద్దు చేస్తుందని ఆయన మరో కీలక హామీ ఇచ్చారు.

BJP: ఢిల్లీ అసెంబ్లీ బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల.. వీరిలో..


''గత పదేళ్లుగా మా ప్రభుత్వం ఢిల్లీలో ఉచిత నీటిని అందిస్తోంది. 12 లక్షలకు పైగా కుటుంబాలకు జీరో వాటర్ బిల్లులు వస్తున్నాయి. అయితే నేను జైలుకు వెళ్లాక ఏమి జరిగిందో నాకు తెలియదు. వాళ్లు ఏదో తప్పు చేశారు. ప్రజలకు వేలు, లక్షల్లో ప్రతినెలా నీటి బిల్లులు వస్తున్నాయి. తప్పుడు బిల్లులు వస్తున్నాయని అనుకుంటున్న వాళ్లు నీటి బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదని నేను బహిరంగంగా, అధికారికంగా ప్రకటిస్తున్నాను. ఓపికతో వేచిచూడండి. ఎన్నికల తర్వాత ఆప్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తప్పుడు బిల్లులన్నింటినీ రద్దు చేస్తుంది. ప్రజలందరికీ ఇది నా హామీ.. ఇందుకు నేను గ్యారెంటీ'' అని కేజ్రీవాల్ తెలిపారు.


కాంగ్రెస్-బీజేపీ పొత్తు పెట్టుకుంటే మేలు

కాంగ్రెస్ పార్టీపై కేజ్రీవాల్ విమర్శలు గుప్పిస్తూ, ఆ పార్టీ ప్రజలకు దూరమైందని, ప్రజాసమస్యల పరిష్కారంలో చిత్తశుద్ధి కొరవడిందని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ రెండు ప్రజావిశ్వాసం కోల్పోయినందున వారు కూటమిగా ఏర్పడాలని సూచించారు. కాంగ్రెస్‌ ఊసే ప్రజలు ఎత్తడం లేదన్నారు. ఢిల్లీలో బీజేపీ విపత్తు (aapda)లో ఉందని, ఆ పార్టీకి ముఖ్యమంత్రి అభ్యర్థి కానీ, ఎజెండా కానీ, ఒక విజన్ కానీ లేవని విమర్శించారు.


ఇవి కూడా చదవండి..

Grameen Bharat Mahotsav 2025: రూరల్ ఇండియా మహోత్సవ్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ

BJP: ఖర్గే రాజీనామా చేసే వరకు పోరాటం..

Read More National News and Latest Telugu News

Updated Date - Jan 04 , 2025 | 02:44 PM