LPG Price Hiked: పెరిగిన సిలిండర్ ధర.. ఎంతంటే..
ABN , Publish Date - Apr 07 , 2025 | 04:47 PM
LPG Price Hiked: కే్ంద్రం గ్యాస్ సిలిండర్ ధరలు పెంచింది. ఒక్కొ బండపై రూ. 50 పెంచింది. ఈ పెంపు ఉజ్వల్ యోజన పథకం కింద సిలిండర్ పొందుతోన్న వారికి సైతం వర్తిస్తుందని కేంద్రం స్పష్టం చేసింది.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 07: న్యూఢిల్లీ, ఏప్రిల్ 07: వంట గ్యాస్ ధరలను కేంద్రం పెంచింది. ఒక్కొ సిలండర్‌పై రూ.50 పెంచింది. ఈ మేరకు పెట్రోలియం శాఖ మంత్రి హరిదీప్ సింగ్ పూరీ సోమవారం న్యూఢిల్లీలో వెల్లడించారు. ఈ పెంపు ధర ఉజ్వల్ యోజన పథకం ద్వారా సిలండర్ పొందుతున్న లబ్దిదారులకు సైతం వర్తిస్తుందని స్పష్టం చేశారు.
దీంతో 14.2 కేజీ ఎల్పీజీ సిలండర్ ధర ప్రస్తుతం రూ. 803 ఉంటే.. ఇకపై దీని ధర రూ. 853 అవుతుందని తెలిపారు. అలాగే ఉజ్వల్ యోజన పథకం కింద అందుకొంటున్న సిలండర్ ధర రూ. 503 నుంచి రూ. 553కు పెరిగిందని వివరించారు. ఇక ప్రతి 15 రోజులకు లేదా ఒక నెలకు.. ఈ ధరలపై సమీక్షిస్తామన్నారు.ఇక 2024, ఆగస్ట్ నుంచి ఇప్పటి వరకు 14.2 కిలోల సిలిండర్ ధరలు పెంచలేదని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఇక పెట్రోల్, డీజిల్ ధరలను సైతం కేంద్రం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. లీటర్‌కు ఏకంగా రూ. 2 మేర పెంచింది. ఈ ధరలు సోమవారం అర్థరాత్రి నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. అయితే పెరిగిన ఈ పెట్రోల్, డీజిల్ ధరలు.. వాహనదారులపై పడవని కేంద్రం క్లియర్ కట్‌గా పేర్కొంది. ఆ యా ధరలు ఆయిల్ కంపెనీలపై పడుతోందని వివరించింది.
ఇవి కూడా చదవండి..
Mamata Banerjee: హామీ ఇస్తున్నా.. జైలుకెళ్లేందు సిద్ధం..
Nara Lokesh: ‘సారీ గయ్స్..హెల్ప్ చేయలేకపోతున్నా’: మంత్రి లోకేశ్
Mary Kom: 20 ఏళ్ల బంధానికి ముగింపు.. విడాకులు తీసుకోబోతున్న మేరీ కోమ్
Waqf Act in Supreme Court: వక్ఫ్ చట్టంపై సుప్రీం విచారణ.. కీలక వ్యాఖ్యలు చేసిన ధర్మాసనం'
For National News And Telugu News