Mahakumbh: త్రివేణిసంగమంలో రాష్ట్రపతి పవిత్ర స్నానం..ఎప్పుడంటే

ABN, Publish Date - Feb 09 , 2025 | 09:06 PM

మహాకుంభ్ మేళాలో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము పర్యటన సుమారు 8 గంటల సేపు జరుగుతుంది. పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనూ పాల్గొంటారు. తొలుత సంగమ స్నానం, అనంతరం అక్షయ్‌వత్, బడే హనుమాన్ ఆలయాల్లో పూజ, దర్శనంలో పాల్గొంటారు.

Mahakumbh: త్రివేణిసంగమంలో రాష్ట్రపతి పవిత్ర స్నానం..ఎప్పుడంటే

న్యూఢిల్లీ: ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా (Mahakumbh Mela)లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) సోమవారంనాడు పాల్గొంటున్నారు. గంగా-యమునా-సర్వసతీ పవిత్ర నదులు కలిసే త్రివేణి సంగమంలో పవిత్రస్నానం చేస్తారు. రాష్ట్రపతి కార్యాలయం ఆదివారంనాడు ఒక అధికారిక ప్రకటనలో ఈ విషయం తెలియజేసింది. జనవరి 13వ తేదీ పుష్య పౌర్ణమి సందర్భంగా ప్రారంభమైన మహాకుంభ్ మేళా ఫిబ్రవరి 26న మహాశివరాత్రి పర్వదినం వరకూ కొనసాగుతుంది.

Mahakumbh 2025 : కుంభమేళాకు వెళ్తున్నారా? ఈ పని చేస్తే క్యూలో నిలబడే అవసరమే రాదు..!


8 గంటల పర్యటన

మహాకుంభ్ మేళాలో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము పర్యటన సుమారు 8 గంటల సేపు జరుగుతుంది. పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనూ పాల్గొంటారు. తొలుత సంగమ స్నానం, అనంతరం అక్షయ్‌వత్, బడే హనుమాన్ ఆలయాల్లో పూజ, దర్శనంలో పాల్గొంటారు. రాష్ట్రపతి పర్యటనలో ఆమె వెంట ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఉంటారు. రాష్ట్రపతి తమ పర్యటనలో భాగంగా డిజిటల్ కుంభ్ అనుభవ్ సెంటర్‌ను సందర్శిస్తారు.


రాష్ట్రపతి మహాకుంభ్ పర్యటన సందర్భంగా భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. సాయంత్రం 5.45 గంటలకు ప్రయాగ్‌రాజ్ నుంచి రాష్ట్రపతి తిరిగి ఢిల్లీకి బయలుదేరుతారు. మహాకుంభ్ మేళా ఆదివారంతో 26 రోజులు పూర్తి చేసుకోగా, ఇంతవరకూ 42 కోట్ల మందికి పైగా భక్తులు సందర్శించారు.


ఇవి కూడా చదవండి..

Delhi: ముంచుకొస్తున్న మరో ఎన్నిక, ఇక పార్టీల ఫోకస్ దానిపైనే..

Delhi CM: ఢిల్లీ సీఎం అతిషి రాజీనామా.. అసెంబ్లీ రద్దు

Delhi CM: ఐదేళ్లలో ముగ్గురు ముఖ్యమంత్రులు.. ఢిల్లీని బీజేపీ పాలించినపుడు ఏం జరిగిందంటే..

For More National News and Telugu News..

Updated Date - Feb 09 , 2025 | 09:06 PM