Maoists: మూడు రాష్ట్రాల సరిహద్దుల్లో మావోయిస్టుల సంచారం..
ABN , Publish Date - Apr 11 , 2025 | 11:40 AM
రాష్ట్రంలో మావోయిస్టు సంచారం ఉందా.. అంటే అవును.. అంటున్నాయి పోలీస్ వర్గాలు. తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులో మావోయిస్టుల సంచారం ఉన్నట్లు పోలీస్ శాఖ పసిగట్టింది. ఈ మేరకు ముమ్మరంగా కూంబింగ్ నిర్వహిస్తోంది.

- క్యూ బ్రాంచ్ పోలీసుల ముమ్మర కూంబింగ్
చెన్నై: తమిళనాడు, కేరళ, కర్ణాటక(Tamil Nadu, Kerala, Karnataka) రాష్ట్రాల సరిహద్దుల్లో మావోయిస్టుల సంచారం ఉందన్న అనుమానంతో రాష్ట్ర క్యూ బ్రాంచ్ పోలీసులు ముమ్మరంగా కూంబింగ్ చేపడుతున్నారు. 2017లో కేరళ రాష్ట్రం మలప్పురం జిల్లా ఎడకరై అటవీ ప్రాంతంలో రాష్ట్రానికి చెందిన మావోయిస్టులు ఆయుధ శిక్షణ శిబిరంలో పాల్గొన్నారు. శిక్షణ జరుగుతున్న సమయంలో తమిళనాడు, కేరళ రాష్ట్రాల మావోయిస్టు వ్యతిరేక దళాలు చుట్టుముట్టాయి.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: మద్యం ప్రియులకో బ్యాడ్ న్యూస్.. రేపు దుకాణాలు బంద్
ఆ సమయంలో ఇరువర్గాలు కాల్పులకు పాల్పడగా, మావోయిస్టులు తప్పించుకున్నారు. అనంతరం చెన్నైలో తలదాచుకున్న మన్నైపురం కార్తీక్, హోసూరులో సంతోష్‌కుమార్‌ను రాష్ట్ర క్యూ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో, రాష్ట్రంలో చెన్నై, కోవై, తేని, రామనాథపురం, సేలం, కన్నియాకుమారి(Ramanathapuram, Salem, Kanyakumari), కృష్ణగిరి జిల్లాల్లో మావోయిస్టుల సంచారం ఉన్నట్లు రహస్య సమాచారం అందింది.
అలాగే, కేరళ రాష్ట్రం వయనాడు, మలప్పురం, పాలక్కాడు ప్రాంతాలు, కర్ణాటక రాష్ట్రం ఉడిపి లో మావోయిస్టులు సంచరిస్తున్నట్టు సమాచారం అందింది. దీంతో, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన నీలగిరి ముచ్చసందిప్పు అటవీ ప్రాంతంలో క్యూ బ్రాంచ్ దళాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి:
గ్యాస్ సిలిండర్ ధర తగ్గించాలి
Read Latest Telangana News and National News