Mayawati: బీఎస్‌పీ నుంచి మేనల్లుడిని బహిష్కరించిన మాయావతి

ABN, Publish Date - Mar 03 , 2025 | 07:04 PM

పార్టీ ప్రయోజనాల దృష్ట్యా ఆకాశ్ ఆనంద్‌ను బీఎస్‌పీ నుంచి బహిష్కరించినట్టు మాయావతి ప్రకటించారు.ఆకాశ్ ఆనంద్ పశ్చాత్తాపం వ్యక్తం చేస్తాడని భావించినా అతను రాజకీయ అపరిపక్వత చూపించారని అన్నారు.

Mayawati: బీఎస్‌పీ నుంచి మేనల్లుడిని బహిష్కరించిన మాయావతి

లక్నో: బహుజన్ సమాజ్ పార్టీ (BSP) అధినేత్రి మాయావతి (Mayawati) సోమవారంనాడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తన మేనల్లుడు ఆకాశ్ ఆనంద్‌ (Akash Anand)ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు సామాజిక మాధ్యమం 'ఎక్స్‌'లో పోస్ట్ చేశారు. పార్టీ ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. పార్టీకి సంబంధించిన అన్ని పదవుల నుంచి ఆకాశ్ ఆనంద్‌ను తొలగిస్తున్నట్టు ప్రకటించిన రోజులోపే మాయావతి ఈ కీలక నిర్ణయం తీసుకోవడం విశేషం.

IIT Baba: ఐఐటీ బాబాపై గంజాయి కేసు, ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపు


డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అడుగుజాడల్లో కాన్షీరాం క్రమశిక్షణా సంప్రదాయానికి అనుగుణంగా ఆకాశ్ ఆనంద్‌ను ఆయన మామగారిని బహిష్కరించినట్టే పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు మాయవతి తెలిపారు. దీనికి ముందు ఆదివారంనాడు ఆకాశ్ ఆనంద్‌ను పార్టీ పదవుల నుంచి తొలగిస్తూ మాయావతి వరుస ట్వీట్లు చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన కారణంగా ఆకాశ్ ఆనంద్ మామ అశోక్ సిద్ధార్థ్ నుంచ పార్టీ నుంచి బహిష్కరించామన్నారు. దీనిపై ఆకాశ్ ఆనంద్ పశ్చాత్తాపం వ్యక్తం చేస్తాడని భావించినా అతను రాజకీయ అపరిపక్వత చూపించారని అన్నారు. ఆకాశ్ వివరణ చాలావరకూ తన మామ ప్రభావంతో, అహంకారపూరితంగా ఉందన్నారు. ఇది పార్టీ లక్ష్యాలకు విరుద్దమని మాయావతి చెప్పారు. ఇలాంటి వారు ఇంకా ఉంటే పార్టీ నుంచి తప్పుకోవచ్చని సూచించారు.


ఆకాశ్ ఆనంద్ ఏమన్నారు?

పార్టీ పదవుల నుంచి తొలగించిన అనంతరం అశోక్ ఆనంద్ మాట్లాడుతూ, పార్టీ పదవుల నుంచి తొలగించడం భావోద్వాగానికి గురి చేసిందని అన్నారు. ''ఇదొక పెద్ద సవాలు. పరీక్ష కష్టం, పోరాటం సుదీర్ఘం'' అని అన్నారు. త్యాగం, విధేయత, అంకితభావం వంటి పాఠాలను మాయావతి నాయకత్వంలో తాను నేర్చుకున్నానని చెప్పారు. పార్టీ సిద్ధాంతాలు ఒక ఐడియా కాదని, జీవనవిధానమని చెప్పారు. మాయవతి తీసుకునే ఎలాంటి నిర్ణయానికైనా తాము కట్టుబడి ఉంటామని, గౌరవిస్తామని చెప్పారు. బీఎస్‌పీ నిజమైన కార్యకర్తగా పార్టీ కోసం, సమాజ హక్కుల కోసం పారాడతానని తెలిపారు.


ఇవి కూడా చదవండి

MK Stalin: కొత్త దంపతులు వెంటనే పిల్లల్ని కనండి

Mamata Banerjee: డూప్లికేట్‌ ఎపిక్‌ నంబర్లు ఉంటే.. నకిలీ ఓటర్లు ఉన్నట్లు కాదు!

Raksha Khadse: కేంద్ర మంత్రి రక్షా ఖడ్సే కుమార్తెకు పోకిరీల వేధింపులు

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 03 , 2025 | 07:06 PM