Share News

School Teacher: ఓ టీచరమ్మ.. నువ్వే నిద్రపోతే.. పిల్లలేం చేయాలి

ABN , Publish Date - Apr 11 , 2025 | 10:43 AM

తరగతి గదిలో పాఠాలు చెప్పాల్సిన ఓ టీచరమ్మ.. విధి నిర్వహణను పక్కకు పెట్టి గుర్రు పెట్టి నిద్రపోసాగింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో.. ఆ టీచర్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఆ వివరాలు..

School Teacher: ఓ టీచరమ్మ.. నువ్వే నిద్రపోతే.. పిల్లలేం చేయాలి
Meerut Class Teacher

మీరట్: ఒకప్పుడు మన సమాజంలో గురువును దైవంగా భావించేవారు. రాజులు సైతం గురువాజ్ఞ శిరసావహించేవారు. వారిపై అంతటి మర్యాద ఉండేది. రాను రాను.. ఈ పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. కొందరు టీచర్ల తీరు వల్ల.. వారిపై గౌరవ మర్యాదలు తగ్గుతున్నాయి. కొందరు ఉపాధ్యాయులు తోటి టీచర్లు, విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తిస్తూ.. ఆ వృత్తికే కళంకం తెస్తున్నారు. మరి కొందరు టీచర్లు తాగి విధులకు హాజరవుతున్నారు. ఇంకొందరు పిల్లలతో దారుణంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో మరో ఘటన చేరింది. క్లాస్‌రూమ్‌లో ఓ టీచరమ్మ ఏం చేస్తుందో తెలిస్తే షాకవుతారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. ఆ వివరాలు..


క్లాస్‌రూమ్‌లో గుర్రు పెట్టి నిద్రపోతుంది ఓ పంతులమ్మ. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్, మీరట్‌లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఇంగ్లీష్ మీడియా కథనం ప్రకారం.. ఈ సంఘటన మీరట్, క్రిష్ణపురిలోని జూనియర్ హై స్కూల్‌లో వెలుగు చూసింది. అసిస్టెంట్ ఉపాధ్యాయురాలు ఒకరు.. క్లాస్‌రూమ్‌లో పిల్లలకు పాఠాలు చెప్పాల్సింది పోయి.. గుర్రు పెట్టి నిద్రపోసాగింది. ఆరాంగా చైర్‌లో కూర్చుని.. మత్తుగా నిద్రలో జోగుతుంది. తాను తరగతి గదిలో ఉన్నాను అనే విషయం పూర్తిగా మర్చిపోయింది ఆ పంతులమ్మ.


ఇందుకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది. దీనిపై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజనులు. మీకు వేలకు వేలు జీతాలు ఇచ్చేది క్లాస్‌లో నిద్రపోవడానికి కాదు.. పిల్లలకు పాఠాలు చెప్పడానికి.. టీచరే ఇలా చేస్తే.. ఇక పిల్లల పరిస్థితి ఏంటి.. వారిని సరైన మార్గంలో నడిపేవారు ఎవరు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈవీడియో కాస్త వివాదాస్పదంగా మారడంతో.. ఉన్నతాధికారులు దీనిపై స్పందించారు. సదరు టీచర్‌పై సస్పెన్షన్ వేటు విధించారు.


గతేడాది అనగా 2024లో అలీగఢ్‌లో ఇదే తరహా ఘటన వెలుగు చూసింది. ఓ టీచర్ క్లాస్‌రూమ్‌లో కింద నేల మీద పడుకుంటే.. పిల్లలు తమ చేతులతో సదరు టీచర్‌కు గాలి ఊపుతున్న వీడియో సంచలనం సృష్టించింది. ఇక రెండు రోజుల క్రితం మధ్యప్రదేశ్‌లో ఫ్యూన్ ఎగ్జామ్ పేపర్లు కరెక్షన్ చేసిన ఘటన వెలుగు చూసింది. వేలకు వేలు జీతాలు తీసుకుంటూ పిల్లలకు నాణ్యమైన విద్య అందించాల్సిన ఉపాధ్యాయులు ఇంత నిర్లక్షంగా వ్యవహరిస్తే.. పిల్లలకు చదువు ఎలా వస్తుంది.. వారి భవిష్యత్తు ఏంటి అని జనాలు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

Custody: తహవ్వుర్‌ రాణాకు 18 రోజుల ఎన్ఐఏ కస్టడీ

Hyderabad: మద్యం ప్రియులకో బ్యాడ్ న్యూస్.. రేపు దుకాణాలు బంద్‌

Updated Date - Apr 11 , 2025 | 10:47 AM