MK Stalin: కొత్త దంపతులు వెంటనే పిల్లల్ని కనండి
ABN , Publish Date - Mar 03 , 2025 | 02:44 PM
మారుతున్న జనాభా ఆధారిత పరిస్థితులను స్టాలిన్ ప్రస్తావిస్తూ, తగినంత సమయం తీసుకునే పిల్లల్ని కనమని గతంలో తాము సూచించే వాళ్లమనీ, ఇప్పుడు పరిస్థితి మారిందని అన్నారు.

చెన్నై: నియోజకవర్గాల పునర్విభజన రగడ తమిళనాట ముదురుతోంది. జనాభా ప్రాతిపదికగా నియోజకవర్గాల పునర్విభజన వల్ల లోక్‌సభ స్థానాలు తగ్గి తమిళనాడు ప్రయోజనాలు దెబ్బతింటాయని చెబుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) తాజాగా రాష్ట్ర ప్రజలను అప్రమత్తం చేశారు. తమిళనాడులో కొత్తగా పెళ్లయిన దంపతులు వెంటనే పిల్లల్ని కనాలని సోమవారంనాడు కోరారు. రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా అమలు చేసిన కుటుంబ నియంత్రణ చర్యలతో ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినేలా ఉన్నాయన్నారు. జనాభా ఆధారిత డీలిమిటేషన్ వల్ల తమిళనాడుకు పార్లమెంటులో ప్రాతినిధ్యం తగ్గిపోతుందని, రాష్ట్ర ప్రజలు తన విజ్ఞప్తిపై దృష్టి సారించాలని కోరారు.
Ganga River Pollution: స్నానానికి పనికిరాని గంగ నీరు!
మారుతున్న జనాభా ఆధారిత పరిస్థితులను స్టాలిన్ ప్రస్తావిస్తూ, తగినంత సమయం తీసుకునే పిల్లల్ని కనమని గతంలో తాము సూచించే వాళ్లమనీ, ఇప్పుడు పరిస్థితి మారిందని, జనాభా లెక్కల ఆధారంగానే డీలిమిటేషన్ అమలు జరుగుతుందన్న భయాలు కారణంగానే ఇప్పుడు ఎలాంటి జాప్యం లేకుండానే పిల్లల్ని కనమని కోరుతున్నామని సీఎం చెప్పారు.
''మనం ఇప్పుడు ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నామో మీ అందరికీ తెలుసు. కేంద్ర ప్రభుత్వం బలవంతంగా త్రిభాషా విధానం అమలు చేయాలని ప్లాన్ చేస్తోంది. ఇదేవిధంగా వాళ్లు (కేంద్రం) నియోజకవర్గాల పునర్విభజనతో తమిళనాడుకు ప్రాతినిధ్యం, హక్కులు తగ్గించాలనుకుంటోంది. ఆ కారణంగానే మార్చి 5న అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చాం. ఎన్నికల కమిషన్ ముందు రిజిస్టర్ చేసుకున్న 40 రాజకీయ పార్టీలను ఆహ్వానించాం. దీన్ని రాజకీయ కోణం నుంచి చూడవద్దు. ఇది మన హక్కులు, తమిళనాడు హక్కులకు సంబంధించిన అంశం'' అని స్టాలిన్ నాగపట్నంలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ చెప్పారు. కొత్తగా పెళ్లయిన దంపతులు తక్షణమే పిల్లల్ని కని, వారికి మంచి తమిళ పేర్లు పెట్టాలని కోరారు.
ఇవి కూడా చదవండి
Mamata Banerjee: డూప్లికేట్ ఎపిక్ నంబర్లు ఉంటే.. నకిలీ ఓటర్లు ఉన్నట్లు కాదు!
Raksha Khadse: కేంద్ర మంత్రి రక్షా ఖడ్సే కుమార్తెకు పోకిరీల వేధింపులు
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.