MK Stalin: ముందే చెప్పానన్న స్టాలిన్... పీఎం వస్తే ఇదేం మర్యాదని నిలదీసిన బీజేపీ
ABN , Publish Date - Apr 06 , 2025 | 08:19 PM
త్రిభాషా విధానం, డీలిమిటేషన్ అంశాలపై తమిళనాడు ప్రభుత్వం, కేంద్రానికి మధ్య వివాదం నడుస్తున్న తరుణంలో ప్రధాని అధికారిక కార్యక్రమానికి సీఎం హాజరుకాకపోవడం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది.

చెన్నై: రామేశ్వరంలో రూ.535 కోట్లతో నిర్మించిన పాంబన్ వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారంనాడు ప్రారంభించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గైర్హాజర్ కావడం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే త్రిభాషా విధానం, డీలిమిటేషన్ అంశాలపై తమిళనాడు ప్రభుత్వం, కేంద్రానికి మధ్య వివాదం నడుస్తున్న తరుణంలో ప్రధాని అధికారిక కార్యక్రమానికి సీఎం హాజరుకాకపోవడం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది.
PM Modi: తమిళ నేతలకు మోదీ చురకలు మామాలుగా లేవుగా
ప్రధాని పాంబన్ వంతెన ఆవిష్కరణలో ఉండగా, ఇదే సమయంలో ఉదగమండలం (ఊటీ)లో ప్రభుత్వ ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్టాలిన్ పాల్గొన్నారు. రామేశ్వరంలో జరిగే కార్యక్రమానికి హాజరుకాలేనంటూ తన అసక్తతను ప్రధాని మోదీకి తెలియజేసినట్టు ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ''నియోజకవర్గాల పునర్విభజనపై మెమొరాండం సమర్పించేందుకు అపాయింట్‌మెంట్ కోరాం. నేను ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉండటంతో ఆ (మోదీ) సమావేశానికి హాజరుకాలేకపోతున్నట్టు తెలియజేశాను. ప్రభుత్వం తరఫున మంత్రులు తంగం తెన్నరసు, రాజా కన్నప్పన్‌లను పంపుతున్నట్టు చెప్పాను. డీలిమిటేషన్ పట్ల తమిళనాడు ప్రజలకు ఉన్న భయాలను తొలగించాలని ప్రధానిని ఈ సందర్భంగా కోరుతున్నాను'' అని స్టాలిన్ తెలిపారు.
పీఎంను అవమానించడమే: అన్నామలై
ప్రధాని కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరుకాకపోవడంపై తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె.అన్నామలై విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి చెప్పిన కారణం ఆమోదయోగ్యం కాదని, పీఎం వస్తు్న్న విషయం ఆయనకు తెలుసునని అన్నారు. ప్రధాని మోదీ శ్రీలంక నుంచి ఢిల్లీకి వెళ్లకుండా నేరుగా ఇక్కడకే (రామేశ్వరం) వచ్చారని, ఆయనకు స్వాగతం పలకాల్సిన ప్రాథమిక బాధ్యత సీఎంకు ఉందని అన్నారు. ప్రధాని సమావేశాన్ని బహిష్కరించడం ఆయనను అవమానించడమేనని, అందుకు తమిళనాడు ప్రజలకు సీఎం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి..
Pamban Bridge: పాంబన్ వంతెనను ప్రారంభించిన మోదీ
Roller Coaster Tragedyl: మరికొన్ని నెలల్లో పెళ్లి.. సరదా ప్రాణం తీసింది
Indian Air Force: నాలుగు రోజుల్లోనే ఎయిర్ ఫోర్స్‌కు మరో పెద్ద దెబ్బ
For National News And Telugu News