Share News

PM Modi: అక్కడ రామతిలకం, ఇక్కడ రామసేతు.. ఇదంతా దైవేచ్ఛ : మోదీ

ABN , Publish Date - Apr 06 , 2025 | 04:42 PM

శ్రీలంక నుంచి తిరిగివస్తుండగా రామసేతు దర్శన భాగ్యం లభించిందని, ఇదే సమయంలో దైవిక యాదృచ్ఛికంగా అయోధ్యలో సూర్య కిరణాలు బాలరాముని నుదట తిలకం దిద్దాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు.

PM Modi: అక్కడ రామతిలకం, ఇక్కడ రామసేతు.. ఇదంతా దైవేచ్ఛ : మోదీ

న్యూఢిల్లీ: రామేశ్వరంలో పాంబన్ వంతెన ప్రారంభించడానికి శ్రీలంక నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారంనాడు తిరిగివస్తూ ఏరియల్ వ్యూలో "రామసేతు"ను (Rama Setu)ను దర్శించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను సామాజిక మాధ్యమం "ఎక్స్''లో ప్రధాని షేర్ చేస్తూ, రామసేతు దర్శన భాగ్యం కలగడం తన అదృష్టంగా భావిస్తున్నట్టు తెలిపారు. తాను రామసేతును దర్శించిన సమయంలోనే అయోధ్యలో బాలరామునికి సూర్యుడు తన కిరణాలతో తిలకం దిద్దారని అన్నారు. ఇది ''దైవిక యాదృచ్ఛికం'' (Divine coincidence) అని సంతోషం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలే దేశాన్ని నడిపించే రాముడి అద్భుత శక్తిని పునరుద్ఘాటిస్తాయని అన్నారు.

Ayodhya Surya Tilak: అయోధ్యలో కన్నుల పండువగా నవమి వేడుకలు లైవ్..


''కొద్ది సమయం కిందటే శ్రీలంక నుంచి తిరిగివస్తుండగా రామసేతు దర్శన భాగ్యం లభించింది. ఇదే సమయంలో దైవిక యాదృచ్ఛికంగా అయోధ్యలో సూర్య కిరణాలు బాలరాముని నుదట తిలకం దిద్దాయి. రెండింటిని దర్శించే భాగ్యం దక్కింది. శ్రీరామచంద్ర ప్రభువు మనందరి సంఘటిత శక్తి. ఆయన ఆశీస్సులు ఎప్పటికీ మనందరిపై ఉండాలని కోరుకుంటున్నాను" అని మోదీ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.


రావణాసురుని వధించి, సీతమ్మ చెరను విడిపించేందుకు శ్రీరాముడు తన సేనతో కలిసి లంకకు నిర్మించిన వంతెనే 'రామసేతు'. రామనవమి సందర్భంగా వివిధ అభివృద్ధి ప్రాజెక్టులతో పాటు పాంబన్ సముద్ర వంతెనను ప్రారంభించేందుకు ప్రధాని మోదీ రామేశ్వరం వచ్చారు. కొత్తగా రామేశ్వరం-తాంబరం రైలు సర్వీసును మోదీ ఆదివారం ప్రారంభించారు. బ్రిడ్జి కింద నుంచి కోస్ట్ గార్డ్ నౌక ప్రయాణించేందుకు కూడా పచ్చజెండా ఊపారు.


ఇవి కూడా చదవండి..

Pamban Bridge: పాంబన్ వంతెనను ప్రారంభించిన మోదీ

PM Modi: పాంబన్ బ్రిడ్జితో శరవేగంగా వాణిజ్యం, పర్యాటకాభివృద్ధి: మోదీ

Roller Coaster Tragedyl: మరికొన్ని నెలల్లో పెళ్లి.. సరదా ప్రాణం తీసింది

Indian Air Force: నాలుగు రోజుల్లోనే ఎయిర్ ఫోర్స్‌కు మరో పెద్ద దెబ్బ

For National News And Telugu News

Updated Date - Apr 06 , 2025 | 04:45 PM