Maha Kumbh: మహాకుంభ్ రైళ్లపై రాళ్ల దాడి
ABN , Publish Date - Jan 28 , 2025 | 02:58 PM
ఛాతర్‌పూర్, హర్పల్‌పూర్ రైల్వే స్టేషన్లలో జరిగిన ఘటనలపై అధికారులు వెంటనే స్పందించారు. ప్రయాణికుల భద్రతకు కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 29న మౌన అవావాస్య సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌కు ప్రయాణికుల రద్దీ బాగా పెరిగిందని, డిమాండ్‌కు తగ్గట్టుగా ప్రత్యేక రైళ్లు నడుపుతున్నామని తెలిపారు.

భోపాల్: 'మహాకుంభ్' (Mahakumbh) వెళ్తున్న ప్రత్యేక రైళ్లపై మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లో రాళ్ల దాడి జరిగింది. మహాకుంభ్ వెళ్లేందుకు ప్లాట్‌ఫాం మీద సిద్ధంగా నున్న ప్రయాణికులు ఆగ్రహంతో రాళ్లు రువ్వుతూ విధ్వంసం సృష్టించే ప్రయత్నం చేశారు. ఛాతర్‌పూర్ జిల్లాలోని రెండు రైల్వే స్టేషన్లలో ఈ ఘటనలు చేసుకున్నాయి. ప్రయాణికులతో రైళ్లు కిక్కిరిసి పోవడం, తలుపులు మూసేసి కనిపించడం, డోర్లు ఎవరూ తెరవకపోవడంతో అప్పటికే ఫ్లాట్‌ఫాం మీద వేచిచూస్తున్న ప్రయాణికులు కొందరు ఆగ్రహావేశాలకు లోనైనట్టు పలు వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. ఛాతర్‌పూర్, హర్పల్ పూర్ రైల్వే స్టేషన్లలో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. కొందరు రాళ్లు రువ్వగా, మరికొందరు బోగీల తలుపులు బాదుతూ విధ్వంసం సృష్టించారు.
IRCTC Tatkal Booking : ఉదయం 10 తర్వాత తత్కాల్ బుకింగ్ పనిచేయదు..'ఎమర్జెన్సీ టిక్కెట్' సిస్టమ్‌పై వివాదం..
స్పందించిన అధికారులు
ఛాతర్‌పూర్, హర్పల్‌పూర్ రైల్వే స్టేషన్లలో జరిగిన ఘటనలపై అధికారులు వెంటనే స్పందించారు. ప్రయాణికుల భద్రతకు కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 29న మౌన అవావాస్య సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌కు ప్రయాణికుల రద్దీ బాగా పెరిగిందని, డిమాండ్‌కు తగ్గట్టుగా ప్రత్యేక రైళ్లు నడుపుతున్నామని తెలిపారు.
రైళ్ల కిటికీలు, డోర్లు మూసేయడంతో ప్రయాగ్‌రాజ్ వెళ్లే రైలు ఎక్కలేకపోయినట్టు ఒక ప్రయాణికుడు తెలిపాడు. ఛాతర్‌పూర్ స్టేషన్ వద్ద ప్రయాణికులు ఆందోళనకు దిగడం, రాళ్లు రువ్వడంతో ప్రభుత్వ రైల్వే పోలీసులు (జీఆర్‌పీ) వెంటనే జోక్యం చేసుకుని, రైలు తలుపులు తెరిపించినట్టు చెప్పాడు. అప్పటికై రైలు కిటకిటలాడుతుండటంతో చాలామంది బోగీల్లోకి అడుకుపెట్టలేకపోయినట్టు తెలిపాడు. కాగా, ఛాతర్‌పూర్, హర్పాల్‌పూర్ స్టేషన్ల వద్ద బోర్డింగ్‌కు సంబంధించి గొడవ చెలరేగడం తమ దృష్టికి వచ్చినట్టు ఝాన్సీ రైల్వే డివిజన్ పబ్లిక్ రిలేషన్స్ అధికారి మనోజ్ కుమార్ సింగ్ తెలిపారు. సిబ్బంది సమన్వయంతో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రయాగ్‌రాజ్‌కు నిరంతరాయంగా రైళ్లు నడుపుతున్నామని, రద్దీకి తగ్గట్టుగా ప్రత్యేక రైళ్లు వేశామని తెలిపారు. ప్రయాణికులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఇవి కూడా చదవండి..
Mauni Amavasya: మౌని అమావాస్య.. పితృ దోషం నుండి ఇలా బయటపడండి..
Kumbh Mela 2025: మహా కుంభమేళాను 15 రోజుల్లో ఎంత మంది సందర్శించారో తెలుసా..
Read More National News and Latest Telugu News