RSS: ఆర్ఎస్ఎస్, బీజేపీ విభేదాలపై సంఘ్ నేత ఆసక్తికర వ్యాఖ్యలు

ABN, Publish Date - Mar 22 , 2025 | 09:28 PM

సంఘ్ కింద 32 సంస్థలు పనిచేస్తున్నాయనీ, ప్రతి ఆర్గనైజేషన్ స్వతంత్రంగా పని చేస్తుందని, సొంతగానే నిర్ణయాలు తీసుకుంటారని అరుణ్ కుమార్ చెప్పారు. ప్రతి సంస్థకు సొంత సభ్యులు, ఎన్నికలు, స్థానిక-జిల్లా-మండల స్థాయిలో సొంత వ్యవస్థ ఉంటుందన్నారు.

RSS: ఆర్ఎస్ఎస్, బీజేపీ విభేదాలపై సంఘ్ నేత ఆసక్తికర వ్యాఖ్యలు

బెంగళూరు: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS), భారతీయ జనతా పార్టీ (BJP) మధ్య దూరం పెరుగుతోందంటూ జరుగుతున్న ప్రచారంపై సంఘ్ కీలక నేత అరుణ్‌ కుమార్ (Arun Kumar) స్పష్టత ఇచ్చారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ మధ్య ఎలాంటి అంతరాలు లేవని చెప్పారు. సమాజం, దేశానికి సంబంధించిన అంశాలపై ఆర్ఎస్ఎస్, బీజేపీ కలిసికట్టుగా పనిచేస్తున్నట్టు చెప్పారు. పరస్పర విశ్వాసం ప్రాతిపదికగా ఇది కొనసాగుతుందని బెంగళూరులో శనివారంనాడు మాట్లాడుతూ ఆయన చెప్పారు.

Delhi Budget: బడ్జెట్‌కు 10 వేల సూచనలు అందాయి: రేఖాగుప్తా

సంఘ్ కింద 32 సంస్థలు పనిచేస్తున్నాయనీ, ప్రతి ఆర్గనైజేషన్ స్వతంత్రంగా పని చేస్తుందని, సొంతగానే నిర్ణయాలు తీసుకుంటారని అరుణ్ కుమార్ చెప్పారు. ప్రతి సంస్థకు సొంత సభ్యులు, ఎన్నికలు, స్థానిక-జిల్లా-మండల స్థాయిలో సొంత వ్యవస్థ ఉంటుందన్నారు.

వచ్చేనెలలో బీజేపీ కొత్త సారథి

కాగా, బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ ఏప్రిల్‌లో ఒక కొలిక్కి రానున్నట్టు తెలుస్తోంది. తొలుత ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలోనే ఖరారు చేయాలని భావించినప్పటికీ పార్లమెంటు బడ్జెట్ సమావేశాల కారణంగా ఆలస్యమైంది. ప్రాంతం, విధేయత, అనుభవం ప్రాతిపదికగా కొత్త అధ్యక్షుడి ఎన్నిక ఉంటుందని, వచ్చే ఏడాది తమిళనాడు, కేరళ రాష్ట్రాల ఎన్నికలు ఉండటం, తెలంగాణ, కర్ణాటకలో అధికారంలోకి రావాలని బీజేపీ పట్టుదలగా ఉండటంతో దక్షిణాదికి చెందిన వ్యక్తికి బీజేపీ జాతీయ అధ్యక్ష పగ్గాలు ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

ఇవి కూడా చదవండి..

JAC Meet Delimitation: డీలిమిటేషన్‌పై హైదరాబాద్‌లో జేఏసీ తదుపరి భేటీ

Chennai: మాజీసీఎం ఘాటు సమాధానం.. మీ పార్టీని తన్నుకుపోతారు

MLA: ఇంత దారుణం ఎన్నడూ చూడలేదు.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా..

Read Latest and National News

Updated Date - Mar 22 , 2025 | 09:29 PM