Mayawati: నేనున్నంత వరకూ నాకు వారసులు ఉండరు: మాయావతి బిగ్ స్టేట్‌మెంట్

ABN, Publish Date - Mar 02 , 2025 | 02:55 PM

మాయావతి రాజకీయ వారుసుడిగా, బీఎస్‌పీ జాతీయ కో-ఆర్డినేటర్‌గా ఆకాష్ ఆనంద్ ఇంతవరకూ వ్యవహరిస్తున్నారు. లక్నోలో ఆదివారంనాడు బీఎస్‌పీ జాతీయ ఎగ్జిక్యూటివ్ సమావేశం నిర్వహించారు.

Mayawati: నేనున్నంత వరకూ నాకు వారసులు ఉండరు: మాయావతి బిగ్ స్టేట్‌మెంట్

లక్నో: బహుజన్ సమాజ్ పార్టీ (BSP) జాతీయ అధ్యక్షురాలు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి (Mayawati) తన రాజకీయ వారసత్వం (Successor)పై సంచలన ప్రకటన చేసారు. తాను జీవించినంత కాలం పార్టీకి తన వారసులు అంటూ ఎవరూ ఉండరని డిక్లేర్ చేశారు. మరో కీలక నిర్ణయం కూడా ప్రకటించారు. తన మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌ నిర్వహిస్తున్న రెండు బాధ్యతల నుంచి ఆయనను తప్పించారు. మాయావతి రాజకీయ వారుసుడిగా, బీఎస్‌పీ జాతీయ కో-ఆర్డినేటర్‌గా ఆకాష్ ఆనంద్ ఇంతవరకూ వ్యవహరిస్తున్నారు. లక్నోలో ఆదివారంనాడు బీఎస్‌పీ జాతీయ ఎగ్జిక్యూటివ్ సమావేశం నిర్వహించారు.

Church Festival Tragedy: చర్చి ఉత్సవాల్లో విషాదం.. అందరూ చూస్తుండగానే..


పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ ఎంపీ అశోక్ సిద్ధార్థ్‌ను పార్టీ నుంచి మాయావతి ఇటీవల బహిష్కరించారు. ఆకాశ్ ఆనంద్ మామగారైన అశోక్ సిద్దార్థ్‌ను ఫ్యాక్షనలిజం కారణంగా పార్టీ బహిష్కరించింది. ఈ క్రమంలోనే ఆకాష్ ఆనంద్‌ను పార్టీ బాధ్యతల నుంచి మాయావతి తొలగించారు. ఆకాష్ ఆనంద్ రాజకీయ కెరీర్‌పై ఆయన మామ ప్రభావం ఉందని మాయావతి ఇటీవల ఆరోపించారు.


కాగా, తాజా మార్పులు, చేర్పుల్లో భాగంగా రాజ్యసభ ఎంపీ రామ్జీ గౌతంను బీఎస్‌పీ నేషనల్ కోఆర్డినేటర్‌గా తిరిగి నియమించారు. 2019 వరకూ ఆయన ఈ పదవిని నిర్వహించారు. ప్రస్తుతం జాతీయ కోఆర్డినేటర్ పదవిని మాయావతి చిన్న తమ్ముడు ఆనంద్ కుమార్‌తో కలిసి ఆయన పంచుకుంటారు. తన రాజకీయ వారసత్వంపై కూడా మాయావతి స్పష్టమైన ప్రకటన చేశారు. తాను బతికున్నంత వరకూ పార్టీకి తన రాజకీయ వారసుండంటూ ఎవరూ ఉండరని స్పష్టం చేశారు. కాగా, ఆకాష్ ఆనంద్‌ను పార్టీ బాధ్యతల నుంచి మాయవతి తప్పించడం ఇది రెండోసారి. గత ఏడాది మేలో లోక్‌సభ ఎన్నికల సమయంలో పార్టీ బాధ్యతల నుంచి ఆయనను తప్పించారు. అయితే ఆ తర్వాత జూలైలో జంట బాధ్యతలను ఆయనకు మాయావతి అప్పగించారు.


ఇవి కూడా చదవండి

PM Modi: 100 జిల్లాల్లో పీఎం ధన ధాన్య కృషి

Privilege Motion: జైశంకర్‌పై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 02 , 2025 | 02:55 PM