PM Modi: తమిళ నేతలకు మోదీ చురకలు మామాలుగా లేవుగా
ABN , Publish Date - Apr 06 , 2025 | 07:13 PM
తమిళ భాషలో మెడికల్ కోర్సులు ప్రారంభించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని తాను కోరుతున్నాననీ, ఇందువల్ల పేద కుటుంబాల పిల్లలు సైతం వైద్యులు కావాలనే తమ కలలను పండించుకుంటారని మోదీ అన్నారు.

న్యూఢిల్లీ: భాషా వివాదంపై ఎంకే స్టాలిన్ సారథ్యంలోని తమిళనాడు ప్రభుత్వానికి, కేంద్రానికి మధ్య వివాదం నడుస్తున్న నేపథ్యంలో డీఎంకే ప్రభుత్వంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) పరోక్షంగా చురకలు వేశారు. తమిళనాడు నేతలు తనకు లేఖలు రాస్తున్నారనీ, కానీ ఏ ఒక్కరూ తమిళంలో సంతకాలు చేయడం లేదని అన్నారు. ''తమిళం మీకు గర్వకారణమైతే కనీసం సంతకాలైనా తమిళంలో చేయాలని కోరుతున్నాను'' అని మోదీ వ్యాఖ్యానించారు. రామేశ్వరంలో పాంబన్ బ్రిడ్జిని ఆదివారంనాడు ప్రారంభించిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోదీ మాట్లాడారు.
PM Modi: పాంబన్ బ్రిడ్జితో శరవేగంగా వాణిజ్యం, పర్యాటకాభివృద్ధి: మోదీ
''తమిళ భాష, వారసత్వం ప్రపంచం నలుమూలలా విస్తరించేందుకు మా ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోంది. తమిళనాడుకు చెందిన కొందరు నేతలు రాసిన లేఖలు చూసి నాకు ఆశ్యర్యం వేసింది. ఏ ఒక్కరూ తమ సంతకం తమిళంలో చేయలేదు. తమిళం మీకు గర్వకారణం అయితే కనీసం సంతకాలైనా మీరు తమిళంలో చేయండి'' అని మోదీ అన్నారు.
తమిళ భాషలో మెడికల్ కోర్సులు ప్రారంభించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని తాను కోరుతున్నాననీ, ఇందువల్ల పేద కుటుంబాల పిల్లలు సైతం వైద్యులు కావాలనే తమ కలలను పండించుకుంటారని మోదీ అన్నారు. మన యువత వైద్యులు కావడానికి విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా చూడాలన్నదే తమ ప్రయత్నమని, గత 10 ఏల్లలో తమిళనాడుకు కొత్తగా 10 మెడికల్ కాలేజీలు వచ్చాయని ప్రధాని చెప్పారు.
ఇవి కూడా చదవండి..
Pamban Bridge: పాంబన్ వంతెనను ప్రారంభించిన మోదీ
Roller Coaster Tragedyl: మరికొన్ని నెలల్లో పెళ్లి.. సరదా ప్రాణం తీసింది
Indian Air Force: నాలుగు రోజుల్లోనే ఎయిర్ ఫోర్స్‌కు మరో పెద్ద దెబ్బ
For National News And Telugu News