భార్య వేధింపులు తట్టుకోలేక.. ట్రైన్‌కి ఎదురెళ్లి మరీ
ABN , Publish Date - Apr 07 , 2025 | 08:39 AM
20 లక్షల రూపాయలు ఎదురు కట్నం ఇచ్చి మరీ పెళ్లి చేసుకున్న భార్య.. భర్తకు నరకం చూపెట్టింది. ఆ టార్చర్ భరించేకన్నా చావే మేలు అనుకున్న వ్యక్తి.. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఒడిశాలో చోటు చేసుకుంది. ఆ వివరాలు..

భువనేశ్వర్: ఈ సమాజానికి ఏమవుతుందో.. ఎటు పోతుందో అర్థం కావడం లేదు. ఒకప్పుడు వేధింపులు అంటే కేవలం మహిళలు మాత్రమే ఎదుర్కునేవారు అనే అభిప్రాయం ఉండేది. ఒకవేళ మగాళ్లకు అలాంటి పరిస్థితులు ఎదురైనా మౌనంగా భరించేవారు ఏమో కానీ బయటకు మాత్రం వెల్లడించకపోయేవారు. అయితే రాను రాను లోకం తీరు మారుతోంది. ప్రేమించిన వాడి కోసమే.. మరే ఇతర కారణాల కోసమో కానీ.. భర్తలను పీడించి, హింసించి.. ఆఖరికి వారిని హత్య చేసే భార్యల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. మరీ ముఖ్యంగా భార్యల వేధింపులు తట్టుకోలేక.. ప్రాణాలు తీసుకున్న భర్తల గురించి గత కొన్ని రోజులుగా వార్తలు చదువుతున్నాం. తాజాగా ఈ జాబితాలోకి మరో వ్యక్తి చేరాడు. భార్య టార్చర్ కన్నా చావే సుఖం అనుకున్నాడు. ఆమె నోట్లో నోరు పెట్టడం కన్నా.. రైలు పట్టాల మీద తల పెట్టడం మంచిదని భావించి.. రైలుకు ఎదురెళ్లి.. మరీ ప్రాణం తీసుకున్నాడు. దీనికి ముందు భార్య తనను ఏవిధంగా టార్చర్ పెడుతుందో వివరిస్తూ వీడియో రికార్డ్ చేశాడు. ఇప్పుడీ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆ వివరాలు..
ఈ సంఘటన ఒడిశాలో చోటు చేసుకుంది. రామచంద్ర బర్జేనా అనే వ్యక్తి.. అతడి భార్య రూపాలి వేధింపులు తాళలేక రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. దానికి ముందు వీడియో రికార్డ్ చేస్తూ తన గోడు వెళ్లబోసుకున్నాడు. "నా పేరు రామచంద్ర బర్జేనా. నేను కుంభరబస్తా ప్రాంతంలో నివాసం ఉంటాను. నా భార్య వల్ల నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను" అని చెప్పి ఎదురుగా వస్తోన్న రైలు కిందకు దూకాడు. స్పాట్‌లోనే మృతి చెందాడు రామచంద్ర.
వీడియో వైరల్ కావడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. రామచంద్ర, రూపాలి దంపతులకు కొన్నాళ్ల క్రితం వివాహం అయ్యింది.. వారికి ఒక కుమార్తె కూడా ఉంది. అయితే గత కొన్నాళ్లుగా రూపాలి తన భర్తను మానసికంగా వేధింపులకు గురి చేస్తుంది. అంతేకాక ఇంట్లో గొడవలు రాజేస్తూ.. అతడిని ఇబ్బందిపెట్టసాగింది. ఎంత మంచిగా నచ్చచెప్పినా రూపాలి తీరు మార్చుకోలేదు. విసుగు చెందిన రామచంద్ర ఆత్మహత్య వంటి దారుణ నిర్ణయం తీసుకున్నాడు.
ఈ సందర్బంగా రామచంద్ర తల్లిదండ్రులు మాట్లాడుతూ.. తమ కోడలు తరచుగా పుట్టింటికి వెళ్లి అక్కడే నెలల తరబడి ఉండేదని తెలిపారు. ఒకవేళ రామచంద్ర అత్తగారింటికి వెళ్లకపోతే.. అతడిని దారుణంగా మాట్లాడేదని.. నిందించేదని ఆరోపించారు. అంతేకాక పెళ్లి ఖర్చులు మొత్తం తామే పెట్టుకున్నామని.. పైగా రూపాలికి 20 లక్షల రూపాయలు ఎదురు కట్నం ఇచ్చామని.. అయినా సరే ఆమె తన కొడుకును వేధించి.. చివరకు అతడు ఆత్మహత్య చేసుకునేలా చేసిందని రామచంద్ర తల్లీదండ్రులు ఆరోపించారున. తన కొడుకు చావుకు కారణం అయిన రూపలిని కఠినంగా శిక్షించాలని రామచంద్ర తల్లి డిమాండ్ చేస్తుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
Swimming Pools: స్విమ్మింగ్ పూల్స్‌లో ఈత కొడుతున్నారా.. మీ కళ్లు ఇక అంతే..
YouTube: యూట్యూబ్ నుంచి క్రేజీ ఫీచర్..ఇకపై షార్ట్స్ క్రియోషన్ మరింత ఈజీ