Jamili Elections: 2029 తర్వాతే జమిలి ఎన్నికలు
ABN , Publish Date - Apr 06 , 2025 | 02:35 AM
జమిలి ఎన్నికల ప్రక్రియ 2029 లోక్‌సభ ఎన్నికల తర్వాతే ప్రారంభమవుతుందని నిర్మలా సీతారామన్ తెలిపారు. ఒకే దేశం-ఒకే ఎన్నిక కొత్త ఆలోచన కాదని, దీనిపై రాజకీయ పార్టీల మధ్య భిన్నాభిప్రాయాలు ఉండవచ్చునని వ్యాఖ్యానించారు.

చెన్నై, ఏప్రిల్ 5(ఆంధ్రజ్యోతి): జమిలి ఎన్నికలపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టతనిచ్చారు. 2029 పార్లమెంటు ఎన్నికల తర్వాతే జమిలి ఎన్నికల ప్రక్రియ ఉంటుందన్నారు. ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’(జమిలి) ప్రక్రియను 2029 తర్వాతే రాష్ట్రపతి ప్రారంభిస్తారని ఆమె తెలిపారు. శనివారం చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ అనేది కొత్త ఆలోచన కాదని, ఇది ఎప్పటి నుంచో ఉన్నదేనని తెలిపారు. రాజకీయంగా నేతలు, పార్టీల మధ్య భిన్నాభిప్రాయాలు ఉండవచ్చునని, కానీ, కేంద్రం ప్రతిపాదించిన ప్రతి విషయాన్నీ గుడ్డిగా ప్రతిఘటించడం ఎవరికీ సరికాదని వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి..
Waqf Bill: వక్ఫ్ బిల్లుపై సుప్రీంకోర్టులో కాంగ్రెస్ ఎంపీ పిటిషన్
NEET Row: స్టాలిన్ సర్కార్‌కు ఎదురుదెబ్బ.. నీట్ వ్యతిరేక బిల్లును నిరాకరించిన రాష్ట్రపతి
PM Modi: భద్రతా వలయంలో రామేశ్వరం..
For National News And Telugu News