Share News

Line of Control: పాక్ కవ్వింపు చర్యలు.. భారత్ స్ట్రాంగ్ కౌంటర్

ABN , Publish Date - Apr 02 , 2025 | 02:34 PM

Line of Control: పొరుగునున్న దాయాది దేశం పాకిస్తాన్ .. భారత్‌పై కయ్యానికి కాలు దువ్వుతోంది. ఆ క్రమంలో జమ్మూ కశ్మీర్‌ పూంచ్ జిల్లాలోని నియంత్రణ రేఖ వద్ద భారత్‌ బలగాలపైకి విచక్షణ రహితంగా కాల్పులకు తెగబడింది. ఈ ఘటనపై భారత్ సైన్యం స్పందించింది.

Line of Control: పాక్ కవ్వింపు చర్యలు.. భారత్ స్ట్రాంగ్ కౌంటర్

శ్రీనగర్, ఏప్రిల్ 02: భారత్‌పై పొరుగునున్న పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు దిగుతోంది. తాజాగా జమ్మూ కాశ్మీర్‌ పూంచ్ జిల్లాలోని నియంత్రణ రేఖ వద్ద పహారా కాస్తున్న పాక్ సైనిక బలగాలు.. భారత్‌పై విచాక్షణరహితంగా కాల్పులకు తెగబడ్డాయి. ఈ నేపథ్యంలో భారత్ సైన్యం సైతం వెంటనే అప్రమత్తమై.. తనదైన శైలిలో స్పందించింది. ఆ క్రమంలో పాక్ బలగాలపై ఎదురు కాల్పులకు దిగింది.

ఈ కాల్పుల ఘటనలో ఎవరు గాయపడలేదని భారత్ సైనిక ఉన్నతాధికారులు వెల్లడించారు. అయితే ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని స్పష్టం చేశారు. ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమలులో ఉందని.. పొరుగునున్న దాయాది దేశం ఈ తరహా చర్యలకు పాల్పడుతోందని తెలిపారు. 2021లో పాకిస్తాన్, భారత్ దేశాలకు చెందిన ఉన్నతాధికారులు.. నియంత్రణ రేఖ వద్ద ఎటువంటి కాల్పులకు తెగబడకూడదంటూ ఓ అవగాహాన ఒప్పందం చేసుకున్నారు.


అయితే ఈ ఒప్పందాన్ని పాక్ అడపా దడపా విస్మరిస్తోందని భారత్ సైనిక ఉన్నతాధికారులు చెప్పారు. ఈ సమావేశంలో ఎటువంటి దుశ్చర్యలకు పాల్పడకూడదంటూ ఇరుదేశాలు అంగీకర పత్రంపై సంతకం సైతం చేసిన విషయం విదితమే.

ఈ వార్తలు కూడా చదవండి..

రాబడికి నూతన మార్గాలు

యువకుడిపై పెట్రోల్‌ పోసి..

For More AP News and Telugu News

Updated Date - Apr 02 , 2025 | 02:42 PM