PM Kisan: రైతులకు అలర్ట్.. ఫిబ్రవరి 24లోపు ఈ పని చేయండి.. లేదంటే..

ABN, Publish Date - Feb 19 , 2025 | 12:40 PM

PM Kisan 19th Installment: ఫిబ్రవరి 24వ తేదీన కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు. ఈ డబ్బులు రైతుల ఖాతాల్లో పడాలంటే.. వారు కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది.. అవేంటంటే..

PM Kisan: రైతులకు అలర్ట్.. ఫిబ్రవరి 24లోపు ఈ పని చేయండి.. లేదంటే..
PM Kisan 19th Installment

PM Kisan 19th Installment: వ్యవసాయం చేసే రైతులు ఆర్థికంగా కుంగిపోకుండా.. పెట్టుబడి సాయం అందించే ఉద్దేశ్యంతో.. భారత ప్రభుత్వం 2019లో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని ప్రారంభించింది. ఇప్పటికే 18 విడతలుగా రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసిన కేంద్ర ప్రభుత్వం.. 19వ విడత నిధులు విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఈ విడతలో భాగంగా అర్హులైన రైతుల ఖాతాల్లో రూ. 2000 జమ అవనున్నాయి. ఫిబ్రవరి 24వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ బీహార్‌లోని భాగల్పూర్‌కు చెందిన రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులను జమ చేస్తారు.


కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 18 విడతలు నిధులు విడుదల చేసింది. 9 కోట్లకు పైగా రైతుల ఖాతాల్లో రూ. 20,000 కోట్లు బదిలీ చేయడం జరిగింది. ఈ పథకం కింద అర్హత కలిగిన రైతులకు సంవత్సరానికి రూ. 6,000 ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది. అయితే, ఈ మొత్తాన్ని మూడు విడతలుగా రూ. 2000 చొప్పున అందజేస్తోంది కేంద్ర ప్రభుత్వం.


19వ విడతకు e-KYC అవసరం..

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన నిధులు పొందాలంటే.. రైతులు e-KYC చేయడం తప్పనిసరి. పీఎం కిసాన్ వెబ్ సైట్ ద్వారా ఇంట్లోనే మీ స్మార్ట్ ఫోన్ నుంచి ఈ కేవైసీ చేయవచ్చు. ఇందుకోసం మీరు http://pmkisan.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలి. ఇక్కడ మీరు ఫార్మర్ కార్నర్ ఆప్షన్‌పై క్లిక్ చేసి.. దాని కింద e-KYC ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఆపై మీ ఆధార్ నంబర్‌ను నమోదు చేయాలి. ఇలా చేయడం ద్వారా, మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. మీరు OTP ని ఎంటర్ చేసి, సబ్‌మిట్ చేసిన తరువాత మీ e-KYC ప్రక్రియ పూర్తవుతుంది.


జాబితాలో మీ పేరు ఇలా ఉందో లేదో చెక్ చేసుకోండి..

ప్రధానమంత్రి కిసాన్ యోజన లబ్ధిదారుల జాబితా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటుంది. దీని సహాయంతో, రైతులు ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 19వ విడతను పొందుతారో లేదో సులభంగా చెక్ చేసుకోవచ్చు. జాబితాలో మీ పేరు ఇలా ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి.

1. ముందుగా, ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన అధికారిక వెబ్‌సైట్ https://pmkisan.gov.in/ కి వెళ్లండి.

2. ఫార్మర్ కార్నర్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.

3. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.

4. ఇక్కడ లబ్ధిదారుల జాబితా ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.

5. ఒక ఫారమ్ ఓపెన్ అవుతుంది.

6. ఇందులో ముందుగా రాష్ట్రం, తరువాత జిల్లా, బ్లాక్/గ్రామం పేరును సెలక్ట్ చేసుకోవాలి.

7. అవసరమైన వివరాలన్నీ పూర్తి చేసిన తరువాత.. గెట్ రిపోర్ట్‌పై క్లిక్ చేయాలి.

8. ఇలా చేస్తే మీ గ్రామానికి చెందిన ప్రధాన మంత్రి కిసాన్ యోజన లబ్ధిదారుల జాబితా మొత్తం మీకు కనిపిస్తుంది.

9. ఈ లిస్ట్‌లో మీ పేరు ఉంటే.. పీఎం కిసాన్ పథకం డబ్బులు మీ ఖాతాలో జమ అవుతాయి.


Also Read:

జగన్.. ప్రజలే నీ సంగతి తేలుస్తారు.. జాగ్రత్త

భారత్‌ వద్ద చాలా డబ్బు ఉంది.. వారికి ఇక అవసరం లేదు..

సీఈసీగా జ్ఞానేశ్ కుమార్ బాధ్యతలు స్వీకరణ

For More National News and Telugu News..

Updated Date - Feb 19 , 2025 | 12:40 PM