ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Narendra Modi: ఎన్నారైల కోసం ప్రత్యేక టూరిస్ట్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ

ABN, Publish Date - Jan 09 , 2025 | 03:14 PM

భువనేశ్వర్‌లో గురువారం జరిగిన 18వ ప్రవాసీ భారతీయ దివస్ సదస్సు సందర్భంగా విదేశీ భారతీయుల కోసం అత్యాధునిక పర్యాటక రైలు 'ప్రవాసీ భారతీయ ఎక్స్‌ప్రెస్'ను రిమోట్‌గా ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు.

PM Modi Launches Special Tourist Train

18వ ప్రవాసీ భారతీయ దివస్ (PBD) సదస్సును ప్రధాని నరేంద్ర మోదీ (narendra modi) గురువారం అధికారికంగా ప్రారంభించారు. ఆ తర్వాత ప్రధాని మోదీ సహా అతిథులు ఉండగా.. తొలి స్వాగత గీతం ‘బసుధైవ కుటుంబం’ను ప్రదర్శించారు. అనంతరం విదేశాంగ మంత్రి డాక్టర్‌ ఎస్‌.జైశంకర్‌ స్వాగతోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా హాజరైన ఎన్నారైలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. విదేశాంగ మంత్రి ప్రసంగం అనంతరం ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ రావడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం జరిగిన సదస్సులో రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో అధ్యక్షురాలు క్రిస్టీన్ కార్లా కంగాలూ ప్రవాస సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.


ప్రవాసీ భారతీయ టూరిస్ట్ ఎక్స్‌ప్రెస్‌

ఈరోజు ఉదయం 10.45 గంటల ప్రాంతంలో ప్రవాసీ భారతీయ దివస్ సదస్సును ప్రధాని మోదీ ప్రారంభించగా, తర్వాత ప్రవాసీ భారతీయ టూరిస్ట్ ఎక్స్‌ప్రెస్‌కు (Pravasi Bharatiya Express) ఆయన పచ్చజెండా ఊపి రిమోట్‌గా ప్రారంభించారు. తరువాత NRIలను ఉద్దేశించి, PM మోదీ ఇలా అన్నారు. “మిత్రులారా, మేము మీ సౌలభ్యం, సౌకర్యానికి చాలా ప్రాముఖ్యతనిస్తాము. మీ భద్రత, శ్రేయస్సు మా మొదటి ప్రాధాన్యత. మన విదేశీ భారతీయులు ఎక్కడ ఉన్నా, సంక్షోభ సమయాల్లో వారికి సహాయం చేయడం మా బాధ్యతగా భావిస్తున్నాము. నేటి భారత విదేశాంగ విధానానికి మార్గదర్శక సూత్రాలలో ఇదీ కూడా ఒకటని పేర్కొన్నారు.


అత్యంత నైపుణ్యం కలిగిన దేశం

రాబోయే అనేక దశాబ్దాల వరకు, భారతదేశం ప్రపంచంలోనే అత్యంత యువ, అత్యంత నైపుణ్యం కలిగిన జనాభా కలిగిన దేశంగా ఉంటుంది. నైపుణ్యం కలిగిన ప్రతిభావంతుల కోసం ప్రపంచ డిమాండ్‌ను భారత్ తీరుస్తుంది. నైపుణ్యం కలిగిన ప్రతిభావంతుల కోసం ప్రపంచ డిమాండ్‌ను తీర్చగల సామర్థ్యం భారతదేశానికి ఉందనే విషయాన్ని కూడా ప్రధాని చెప్పారు. ఈ కార్యక్రమం సందర్భంగా ప్రధాని మోదీ నిన్ననే భువనేశ్వర్ చేరుకున్నారు. ఈసారి ప్రవాసీ భారతీయ దివస్ సదస్సును ఒడిశా రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో జనవరి 8 నుంచి 10 వరకు భువనేశ్వర్‌లో (bhubaneswar) నిర్వహిస్తున్నారు.


మీ వల్ల నేను..

''మీ అందరినీ కలవడం నాకు చాలా ఆనందంగా ఉంది. మీ అందరి నుంచి నేను పొందిన ప్రేమ, ఆశీర్వాదాలను నేను ఎప్పటికీ మరచిపోలేను. ఈ రోజు నేను మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే మీ వల్ల నేను తల ఎత్తుకునే అవకాశం వచ్చింది. గత 10 సంవత్సరాలలో, నేను చాలా మంది ప్రపంచ నాయకులను కలుసుకున్నాను. వారందరూ తమ తమ దేశాల్లోని భారతీయ ప్రవాసులను అభినందిస్తున్నారు. దీని వెనుక పెద్ద కారణం మీ సామాజిక విలువలు.'' - ప్రధాని మోదీ


ఈ ట్రైన్ సామర్థ్యం

ప్రవాసుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన ఈ రైలు 'ప్రవాసీ తీర్థ దర్శన్ స్కీమ్'లో భాగం. ఇది విదేశాంగ మంత్రిత్వ శాఖ, ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) సహకారంతో రూపొందించబడింది. ఈ రైలు భారతదేశంలోని ప్రధాన పర్యాటక, మతపరమైన ప్రదేశాలతో సహా పలు గమ్యస్థానాలను సందర్శిస్తుంది. జనవరి 9, 1915న మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుంచి భారతదేశానికి తిరిగి వచ్చిన జ్ఞాపకార్థం జనవరి 9న దీనిని ప్రారంభించారు. ఇది NRIల కోసం ప్రత్యేక పర్యాటక రైలు. ఇది ఢిల్లీలోని నిజాముద్దీన్ నుంచి బయలుదేరి మూడు వారాల పాటు అనేక పర్యాటక, మతపరమైన ప్రాముఖ్యత కలిగిన ప్రదేశాలను సందర్శిస్తుంది. దీని సామర్థ్యం 156 మంది ప్రయాణికులు.


ఇవి కూడా చదవండి:

Maha Kumbh Mela 2025: మహాకుంభ మేళాలో పాల్గొననున్న సినీ తారలు.. ఎవరెవరంటే..


Investment Tips: ఒకేసారి ఈ పెట్టుబడి చేసి మర్చిపోండి.. 15 ఏళ్లకే మీకు కోటీ


Viral News: వేల కోట్ల రూపాయలు సంపాదించా.. కానీ ఏం చేయాలో అర్థం కావట్లే..

Investment Tips: సిప్ పెట్టుబడుల మ్యాజిక్.. ఇలా రూ. 7 కోట్లు పొందండి..

Bima Sakhi Yojana: బీమా సఖి యోజన స్కీం ఇలా అప్లై చేయండి.. నెలకు రూ.7 వేలు పొందండి..

Personal Finance: జస్ట్ నెలకు రూ. 3500 సేవ్ చేస్తే.. రూ. 2 కోట్లు మీ సొంతం..

Investment Tips: రూ. 20 వేల శాలరీ వ్యక్తి.. ఇలా రూ. 6 కోట్లు సంపాదించుకోవచ్చు..

Read More National News and Latest Telugu News

Updated Date - Jan 09 , 2025 | 03:18 PM