Budget-2025: ఈ ఏడాది బడ్జెట్‌తోనైనా వాళ్ల కల నెరవేరుతుందా.. ఆశలన్నీ నిర్మలపైనే..
ABN , Publish Date - Jan 23 , 2025 | 09:50 AM
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో బడ్జెట్-2025(Budget-2025)ను మరికొద్ది రోజుల్లో ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ఫిబ్రవరి 1న బడ్జెట్ 2025న సమర్పించనున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో బడ్జెట్-2025(Budget-2025)ను మరికొద్ది రోజుల్లో ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ఫిబ్రవరి 1న బడ్జెట్ 2025న సమర్పించనున్నారు. ఈ బడ్జెట్‌పై అన్ని వర్గాల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. అయితే ఈసారి ప్రవేశపెట్టబోయే బడ్జెట్ కోసం పేద, మధ్య తరగతి ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. తమకేమైనా లబ్ధి చేకూరుతుందేమోనని ఆసక్తిగా వెయ్యి కళ్లతో చూస్తున్నారు. ఇప్పటికే నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నారు. మరోవైపు జీఎస్టీ సామాన్యుల వీపుపై మోతమోగిస్తోంది.
దేశంలో 75 ఏళ్లుగా బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. లక్షల కోట్ల రూపాయలను దేశాభివృద్ధికి వెచ్చించారు. అయితే ఇప్పటికీ చాలా మంది పేద, మధ్య తరగతి ప్రజలు ఇళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అద్దె ఇళ్లల్లో ఉంటూ నానావస్థలు పడుతున్నారు. బతుకుదెరువు కోసం వచ్చి పట్టణాలు, నగరాల్లో ఎంతోమంది రోడ్ల పక్కన నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ప్రభుత్వ స్థలాల్లో సైతం గుడిసెలు వేసుకుని జీవితం సాగిస్తున్నారు. సొంత గ్రామాల్లో సైతం వారికి సరైన వసతి గృహాలు లేవు. ఇలాంటి వారిని ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకమైన పథకాలను తీసుకువచ్చాయి.
పేద, మధ్యతరగతి వారికి ఇళ్లు నిర్మించేందుకు లక్షల రూపాయలు పథకాల రూపంలో అందిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు పేరుతో ఇస్తుండగా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పీఎంఏవై-ఎన్టీఆర్ నగర్‌గా ఇళ్లను నిర్మించి ఇస్తోంది. కేంద్ర ప్రభుత్వం సైతం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (PMAY-U) పథకాన్ని తెచ్చి పేదలకు గృహాలు నిర్మించేందుకు చేయూతనిస్తోంది. అయినప్పటికీ ఇంకా ఎంతో మందికి ఇళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈసారి బడ్జెట్‌లో గృహ నిర్మాణ పథకాలకు మరింత నగదు కేటాయించి ఇళ్లు నిర్మించాలని కోరుకుంటున్నారు. పెరుగుతున్న జనాభాకు తగినట్లుగా వారి నివాసాల కోసం కేటాయింపులు చేయాలని కోరుతున్నారు.