Jagjit Singh Dallewal: నిరవధిక నిరాహార దీక్షను విరమించిన రైతునేత దల్లేవాల్
ABN, Publish Date - Apr 06 , 2025 | 06:14 PM
సంయుక్త కిసాన్ మోర్చా (రాజకీయేతర), కిసాన్ మజ్దూర్ మోర్చా (కేఎంఎం) సంయుక్త ఫోరం సీనియర్ నేత అయిన దల్లేవాల్ గత ఏడాది నవంబర్ 26న రైతు డిమాండ్లపై కేంద్రపై ఒత్తిడి తెచ్చేందుకు నిరవధిక నిరాహార దీక్షకు దిగారు.

న్యూఢిల్లీ: పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడంతో సహా వివిధ రైతు డిమాండ్లపై నిరవధిక దీక్ష కొనసాగిస్తున్న రైతునేత జగ్గీత్ సింగ్ దల్లేవాల్ (Jagjit Singh Dallewal) ఎట్టకేలకు ఆదివారంనాడు దీక్ష విరమించారు. గత ఏడాది నవంబర్ 26 నుంచి ఆయన నిరవధిక నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. అయితే దీక్షను విరమించాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టు శనివారంనాడు విజ్ఞప్తి చేయడంతో దల్లేవాల్ తాజా నిర్ణయం తీసుకున్నారు. పంజాబ్‌లోని ఫతేగడ్ సాహిబ్ జిల్లాలోని సిర్హంద్‌లో నిర్వహించిన 'కిసాన్ మహా పంచాయత్'లో నిరవధిక నిరాహార దీక్షను విరమిస్తున్నట్టు దల్లేవాల్ ప్రకటించారు.
MA Baby: సీపీఎం ప్రధాన కార్యదర్శిగా ఎంఏ బేబీ
"ఆమరణ నిరాహార దీక్షను విరమించాలని మీరంతా (రైతులు) కోరారు. ఈ ఉద్యమాన్ని జాగ్రత్తగా నడిపినందుకు మీ అందరికీ రుణపడి ఉంటాను. మీ మనోభావాలను గౌరవిస్తున్నాను. మీ ఆదేశాలను పాటిస్తున్నాను'' అని ఈ సందర్భంగా దల్లేవాల్ వ్యాఖ్యానించారు.
సంయుక్త కిసాన్ మోర్చా (రాజకీయేతర), కిసాన్ మజ్దూర్ మోర్చా (కేఎంఎం) సంయుక్త ఫోరం సీనియర్ నేత అయిన దల్లేవాల్ గత ఏడాది నవంబర్ 26న రైతు డిమాండ్లపై కేంద్రపై ఒత్తిడి తెచ్చేందుకు నిరవధిక నిరాహార దీక్షకు దిగారు. గత జనవరిలో రైతులతో చర్చలకు కేంద్రం అంగీకరించడంతో ఖనౌరి నిరసన దీక్షా శిబిరం వద్దే వైద్యచికిత్స తీసుకునేందుకు అంగీకరించారు. అయితే దీక్షను మాత్రం విరమించలేదు. ఈ నేపథ్యంలో శివరాజ్ సింగ్ చౌహాన్ శనివారంనాడు మరోసారి దల్లేవాల్‌ను దీక్ష విరమించాల్సిందిగా కోరారు. రైతు ప్రతినిధులతో ప్రభుత్వం జరుపుతున్న చర్చలు కొనసాగుతున్నాయని, ముందుగా నిర్ణయించిన ప్రకారం మే 4వ తేదీ ఉదయం11 గంటలకు రైతు ప్రతినిధులతో చర్చలు జరుపుతామని హామీ ఇచ్చారు. కేంద్ర మంత్రి బిట్టు సైతం ఇదే తరహా విజ్ఞప్తి చేశారు
ఇవి కూడా చదవండి..
Pamban Bridge: పాంబన్ వంతెనను ప్రారంభించిన మోదీ
PM Modi: పాంబన్ బ్రిడ్జితో శరవేగంగా వాణిజ్యం, పర్యాటకాభివృద్ధి: మోదీ
Roller Coaster Tragedyl: మరికొన్ని నెలల్లో పెళ్లి.. సరదా ప్రాణం తీసింది
Indian Air Force: నాలుగు రోజుల్లోనే ఎయిర్ ఫోర్స్‌కు మరో పెద్ద దెబ్బ
For National News And Telugu News
Updated Date - Apr 06 , 2025 | 06:18 PM