Ranya Rao: గోల్డ్ స్మగ్లింగ్ కేసులో రన్యారావుకు బెయిలు నిరాకరణ

ABN, Publish Date - Mar 14 , 2025 | 06:31 PM

మార్చి 3న దుబాయ్‌ నుంచి బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న రన్యారావును డీఐర్ఐ అధికారులు అదుపులోనికి తీసుకున్నారు. ఆమె నుంచి రూ.12.56 కోట్ల అక్రమ బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో బెయిలు కోరుతూ ఆమె దాఖలు చేసుకున్న పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిగింది.

Ranya Rao: గోల్డ్ స్మగ్లింగ్ కేసులో రన్యారావుకు బెయిలు నిరాకరణ
Ranya Rao

బెంగళూరు: దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తీసుకువస్తూ (Gold Sumuggling) రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన కన్నడ నటి రన్యారావు (Ranya Rao)కు చుక్కెదురైంది. ఆమె బెయిల్ అభ్యర్థనను ఆర్థిక నేరాల విచారణ కోర్టు శుక్రవారంనాడు తోసిపుచ్చింది. ఈ కేసులో రెండో నిందితుడైన తరుణ్ కొండూరు బెయిల్ అభ్యర్థను శనివారం మధ్యాహ్నం 3 గంటలకు కోర్టు విచారించనుంది.

BS Yediyurappa: పోక్సో కేసులో మాజీ సీఎంకు స్వల్ప ఊరట


మార్చి 3న దుబాయ్‌ నుంచి బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న రన్యారావును డీఐర్ఐ అధికారులు అదుపులోనికి తీసుకున్నారు. ఆమె నుంచి రూ.12.56 కోట్ల అక్రమ బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో బెయిలు కోరుతూ ఆమె దాఖలు చేసుకున్న పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరుగగా, ఆమెకు బెయిల్ ఇవ్వరాదని కోర్టును డీఆర్ఐ కోరింది. బెయిలుపై ఆమెను విడుదల చేస్తే ప్రస్తుతం జరుగుతున్న విచారణకు అవరోధం కలుగుతుందని, సాక్ష్యాలను తారుమారు చేయడం, సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశాలున్నాయని వాదించింది.


దీనికి ముందు, డీఆర్ఐ విచారణలో తన పట్ల అధికారులు అనుచితంగా ప్రవర్తించారని, మానసికంగా వేధించారని, బెదిరించారని రెన్యారావు ఇటీవల కోర్టు విచారణలో ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను డీఆర్ఐ తోసిపుచ్చింది. రన్యారావును అదుపులోకి తీసుకున్నప్పుడు, విచారణ జరిపినప్పడు రికార్డు చేశామని, చట్టబద్ధంగా, గౌరవప్రదంగా విచారణ జరిపామని తెలిపింది. ఈ కేసులో ప్రధాన సూత్రధారుల పాత్ర గుర్తించే దిశగా సిబీఐ దర్యాప్తు జరుపుతుండగా, మనీలాండరింగ్ కోణం నుంచి ఈడీ రంగంలోకి దిగి బెంగళూరు సహా పలు చోట్ల దాడులు చేపట్టింది. మరోవైపు, రెన్యారావు వ్యవహారంలో ఆమె సవతి తండ్రి, సీనియర్ ఐపీఎస్ అధికారి కె.రామచంద్రారావు పాత్ర ఏమేరకు ఉందనే దానిపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక సీనియర్ అధికారిని నియమించింది.


ఇవి కూడా చదవండి..

Jaffar Express Attack: ఉగ్రవాదానికి కేంద్ర స్థానం ఎవరో ప్రపంచానికి తెలుసు... పాక్‌కు భారత్ స్ట్రాంగ్ కౌంటర్

Bengaluru: కాంగ్రెస్ ఎమ్మెల్యేపై మహిళా కమిషన్‌కు ఫిర్యాదు.. విషయం ఏంటంటే..

Divya: నటుడు సత్యరాజ్‌ కుమార్తె దివ్య ఆసక్తికర కామెంట్స్.. ఆమె ఏమన్నారంటే..

Updated Date - Mar 14 , 2025 | 06:56 PM