RLJP Exits NDA: ఎన్‌డీఏను వీడిన రాష్ట్రీయ లోక్ జనశక్తి
ABN , Publish Date - Apr 15 , 2025 | 02:56 AM
ఎన్‌డీఏ కూటమికి స్వస్తి చెప్పిన ఆర్‌ఎల్‌జేపీ అధ్యక్షుడు పశుపతి కుమార్ పరస్ తమ పార్టీకి అన్యాయం జరిగిందని సీట్ల వివాదం ప్రభుత్వ బంగ్లా ఖాళీ చేయించడం వంటి పరిణామాల నేపథ్యంలో బయటకు వచ్చామని తెలిపారు

పట్నా, ఏప్రిల్ 14: ఎన్‌డీఏ కూటమి నుంచి బిహార్‌కు చెందిన రాష్ట్రీయ లోక్‌జనశక్తి పార్టీ (ఆర్‌ఎల్‌జేపీ) బయటకు వచ్చింది. ఆ విషయాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు పశుపతి కుమార్ పరస్ సోమవారం ప్రకటించారు. లోక్‌జనశక్తి పార్టీ వ్యవస్థాపకుడు దివంగత రాంవిలాస్ పాసవాన్ సోదరుడైన పశుపతి పరస్ 2021లో పార్టీని చీల్చి ఆర్‌ఎల్‌జేపీని ఏర్పాటు చేశారు. కేంద్ర మంత్రి పదవిని కూడా చేపట్టారు. గత లోక్‌సభ ఎన్నికల్లో సోదరుడి కుమారుడైన చిరాగ్ పాసవాన్ పార్టీకి పొత్తులో భాగంగా ఎన్‌డీఏ కూటమి అయిదు సీట్లు కేటాయించడంతో కినుక వహించి మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆర్‌ఎల్‌జేపీ కార్యాలయంగా ఉన్న ప్రభుత్వ బంగాళాను బిహార్ ప్రభుత్వం ఖాళీ చేయించి, దాన్ని చిరాగ్ పార్టీకి కేటాయించింది. ఈ కారణాల నేపథ్యంలో ఎన్‌డీఏను వీడారు. తమది దళితుల పార్టీ కావడం వల్లనే గుర్తింపు ఇవ్వడం లేదని పశుపతి విమర్శించారు.
ఇవి కూడా చదవండి..