Share News

Siddaramaiah: ఆధారాలుంటే చూపించండి.. కేంద్ర మంత్రికి సీఎం సవాల్

ABN , Publish Date - Jan 05 , 2025 | 08:33 PM

విపక్షాలంటే కేవలం ఆరోపణలు చేయడం కాదని, వాటిని రుజువు చేయాలని కర్ణాటక ముఖ్మమంత్రి సిద్ధరామయ్య కేంద్ర మంత్రి కుమారస్వామిని నిలదీశారు.

Siddaramaiah: ఆధారాలుంటే చూపించండి.. కేంద్ర మంత్రికి సీఎం సవాల్

బెంగళూరు: అవినీతి పెరిగిపోయిందని, మంత్రులు కమిషన్లు తీసుకుంటున్నారంటూ తమ ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు ఉంటే చూపించాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామి (HD Kumaraswamy)ని ఆదివారంనాడు సవాలు చేశారు. డాక్యుమెంట్లు, సాక్ష్యాలు లేకుండా నిరాధారమైన ఆరోపణలు చేస్తే సరిపోదన్నారు.

Ramesh Bidhuri: ప్రియాంక బుగ్గలంత నునుపుగా రోడ్లు.. బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు


''మంత్రులు 60 శాతం కమిషన్లు తీసుకుంటున్నారని, అవినీతి జరుగుతోందని ఆయన (కుమారస్వామి) చెబుతున్నారు. ఆ ఆరోపణలు ముందు రుజువు చేయండి. ఆరోపణలు చేస్తే సరిపోదు, నిరూపించగలగాలి'' అని మీడియాతో మాట్లాడుతూ సిద్ధరామయ్య అన్నారు. విపక్షాలంటే కేవలం ఆరోపణలు చేయడం కాదని, వాటిని రుజువు చేయాలని హితవు పలికారు.


కర్ణాటకలో బస్సు ఛార్జీలు పెంచడంపై సిద్ధరామయ్య మాట్లాడుతూ, గత ప్రభుత్వాల హయాంలోనూ ఛార్జీలు పెంచారని గుర్తు చేశారు. ఉద్యోగుల జీతాలు, డీజిల్ ధరలు పెరగడం, కొత్త బస్సుల కొనుగోలు, ద్రవ్యోల్బంణం వంటి కారణాల వల్ల ఛార్జీలు పెంచాల్సి వచ్చిందని అన్నారు. బస్సు ఛార్జీలు పెంచికూడా చాలా కాలమే అయిందని, రోడ్డు కార్పొరేషన్ సంస్థలన్నీ ఇబ్బందుల్లో ఉన్నాయని, ఛార్జీలు పెంచాలన్న చిరకాల డిమాండ్ కారణంగానే ఆ పని చేశామని చెప్పారు. బీజేపీ, కుమార స్వామి అధికారంలో ఉన్నప్పుడు బస్సు ఛార్జీలు పెంచలేదా అని ప్రశ్నించారు. పెంచలేదని చెప్పమనండి..కేంద్ర ప్రభుత్వం రైల్వే ఛార్జీలు పెంచలేదా అని సీఎం నిలదీశారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడా నిర్వహిస్తు్న్న సిద్ధరామయ్యను బడ్జెట్ ప్రాధాన్యతా క్రమాలపై అడిగినప్పుడు, మార్చిలో బడ్జెట్ సమర్పిస్తామని, ప్రీ-బడ్జెట్ కన్సల్టేషన్స్ ప్రారంభమైనప్పుడు ప్రాధాన్యతా క్రమాల గురించి మాట్లాడతానని ఆయన సమాధానమిచ్చారు.


కుమారస్వామి ఏమన్నారు?

సిద్ధరామయ్య ప్రభుత్వం అవీనితమయంగా మారిందని, కమషన్లకు పాల్పడుతోందని కుమారస్వామి ఆదివారంనాడు మైసూరులో మాట్లాడుతూ ఆరోపించారు. కమిషన్లు 60 శాతానికి పైగా పెరిగిపోయాయని, గత ప్రభుత్వమే మేలని కాంగ్రెస్‌ను సపోర్ట్ చేస్తు్న్న కాంట్రాక్టర్లే చెబుతున్నారని అన్నారు. ఇంతకుముందు చిన్న చిన్న అధికారుల ప్రమేయం ఉండేదని, ఇప్పుడు విధాన సౌధకు కూడా పాకిందని, హౌస్‌లు రిలీజ్ చేయాలన్నా మంత్రులకు కమిషన్లు ఇవ్వాలని, ప్రతి శాఖలోనూ పెర్సంటేజ్‌లు ఫిక్స్ చేశారని ఆరోపించారు. ఇందువల్ల అధికారులు, కాంట్రాక్టుల ఆత్మహత్యలు చోటుచేసుకుంటున్నాయన్నారు.


ఇవి కూడా చదవండి:

PM Modi: బీజేపీకి ఒక్క ఛాన్స్ ఇవ్వండి

Maha Kumbh Mela 2025: ఈ జాతర కోసం 13,000 రైళ్లు.. ఈసారి 40 కోట్ల మంది వస్తారని..

Chatthisghar: నారాయణపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్.. ఎంతమంది మావోలు మృతంటే..

Updated Date - Jan 05 , 2025 | 08:33 PM