Waqf Amendment Act 2025: సుప్రీంకోర్టుకు వక్ఫ్ చట్టం వ్యవహారం.. విచారణ ఎప్పుడంటే..
ABN , Publish Date - Apr 13 , 2025 | 09:08 PM
వక్ఫ్ సవరణ చట్టం-2025పై తమిళగ వెట్రీ కజగం అధ్యక్షుడు, సినీనటుడు విజయ్, కాంగ్రెస్ పార్టీ సహా పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ చట్టం రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ పిటిషన్లు వేశారు.

ఢిల్లీ: వక్ఫ్ సవరణ చట్టం-2025 అమలు దేశవ్యాప్తంగా ఇప్పుడు పెద్దఎత్తున చర్చకు దారి తీసింది. ఇటీవల పార్లమెంట్ ఉభయసభలు బిల్లును పాస్ చేయగా రాష్ర్టపత్రి ద్రౌపదీ ముర్ము ఆమోద ముద్రతో 8, ఏప్రిల్ 2025 నుంచి వక్ఫ్ సవరణ చట్టం-2025 అమలులోకి వచ్చింది. అయితే ఈ చట్టాన్ని కాంగ్రెస్, ముస్లిం సంఘాలు సహా అనేక మంది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ముస్లిం హక్కులను హరించేందుకు వక్ఫ్ చట్టానికి సవరణ చేశారంటూ ఆరోపిస్తున్నారు.
Lift Accident: మరో లిఫ్ట్ ప్రమాదం.. ఒక్కసారిగా మీద పడి.. బాబోయ్..
దీనిపై తమిళగ వెట్రీ కజగం అధ్యక్షుడు, సినీనటుడు విజయ్, కాంగ్రెస్ పార్టీ సహా పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వక్ఫ్ సవరణ చట్టం-2025 రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ పిటిషన్లు వేశారు. ఇప్పటికే దీనిపై 10 పిటిషన్లు స్వీకరించిన ఉన్నత న్యాయస్థానం ఏప్రిల్ 16 విచారణ చేపట్టనుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథ్‌తో కూడిన ధర్మాసనం విచారణ జరపనుంది. అలాగే మరికొన్ని పిటిషన్లను సైతం ధర్మాసనం ముందు లిస్ట్ కానున్నాయి. ఈ పిటిషన్లపై ఈనెల 15నే ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టాల్సి ఉంది.
ABV Political Entry: జగన్ అక్రమాలన్నీ బయటకు తెస్తా.. అందుకే రాజకీయాల్లోకి వస్తున్నా: రిటైర్డ్ ఐపీఎస్
అయితే తమ వాదనలు వినకుండా ఎలాంటి తీర్పులు ఇవ్వొద్దని ఉన్నత న్యాయస్థానాన్ని కేంద్ర ప్రభుత్వం కోరింది. దేశంలోని కోట్లాది మంది ప్రజలు, మతపరమైన ఆస్తులకు సంబంధించిన ముఖ్యమైన అంశాలను పునఃపరిశీలించాల్సిన అవసరం ఉందని కేంద్రం వాదించింది. ఈ మేరకు విజయ్ పిటిషన్ సహా వక్ఫ్ చట్టానికి సంబంధించిన ఇతర పిటిషన్లను ఏప్రిల్ 16న విచారించేందుకు ధర్మాసనం నిర్ణయించింది.
Hyderabad: యువకుడిని తరిమిన ట్రాఫిక్ పోలీసులు.. చివరికి ఏమైందంటే..
మరోవైపు వక్ఫ్ చట్టాన్ని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు(AIMPLB) తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ మేరకు ఏప్రిల్ 19న హైదరాబాద్ దారుస్సలాంలో పెద్దఎత్తున నిరసన సభను నిర్వహించనుంది. ఈ సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వివిధ ముస్లిం సంస్థల ప్రతినిధులు పాల్గొంటారని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. ఈ చట్టం వక్ఫ్ సంస్థల హక్కులను హరించడమేనని ఒవైసీ ఆరోపించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని అంగీకరించబోమని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Harish Rao: సన్నబియ్యం పేరుతో పేదల్ని మోసం చేస్తున్నారు: ఎమ్మెల్యే హరీశ్ రావు..
MLA Komatireddy: నాకు మంత్రి పదవి రాకుండా చూస్తోంది అతనే: ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి..