Share News

Tahawwur Rana: భారత్‌కు 26/11 పేలుళ్ల నిందితుడు తహవూర్ రాణా.. ప్రత్యేక విమానంలో తరలింపు

ABN , Publish Date - Apr 09 , 2025 | 11:37 AM

26/11 ముంబై ఉగ్ర దాడి నిందితుడు తహవీర్ రాణాను ఇండియాకు అప్పగించేందుకు లైన్ క్లియర్ అయ్యింది. ప్రత్యేక విమానంలో అతడిని భారత్‌కు తరలిస్తున్నారని సమాచారం. అతడిని ఇండియాకు తీసుకువచ్చేందుకు భారత్ అధికారుల బృందం అమెరికా వెళ్లినట్లు తెలుస్తోంది.

Tahawwur Rana: భారత్‌కు 26/11 పేలుళ్ల నిందితుడు తహవూర్ రాణా.. ప్రత్యేక విమానంలో తరలింపు
Tahawwur Rana

న్యూఢిల్లీ: సుమారు 17 ఏళ్ల క్రితం అనగా 2008, నవంబర్‌లో జరిగిన ముంబై ఉగ్ర దాడి నిందితుడు తహవూర్ రాణాను భారత్‌కు అప్పగించేందుకు మార్గం సుగమం అయ్యింది. ప్రత్యేక విమానంలో అతడిని అమెరికా నుంచి ఇండియాకు తరలిస్తున్నట్లు సమాచారం. ఈ రోజు రాత్రి లేదా రేపు ఉదయం వరకు అతడు ఇండియాలో అడుగుపెట్టనున్నాడని తెలుస్తోంది. తహవూర్ రాణాకు అమెరికాలో ఉండేందుకు ఉన్న చట్టపరమైన అవకాశాలు అన్ని ముగియడంతో.. అతడిని ఇండియాకు అప్పగించేందుకు నిర్ణయం తీసుకున్నారు. అయితే తనను ఇండియాకు అప్పగించవద్దంటూ తహవూర్ రాణా అమెరికా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై విచారించిన అగ్రరాజ్యం అత్యున్నత న్యాయస్థానం.. తహవూర్ రాణా పిటీషన్‌ని కొట్టివేసింది. తహవూర్ రాణా అభ్యర్థనను కొట్టి వేస్తున్నట్లు అమెరికా సుప్రీం కోర్టు సోమవారం నాడు వెల్లడించింది. గతంలో ఓ సారి అనగా మార్చిలో కూడా తహవూర్ ఇదే విషమై అమెరికా సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. అభ్యర్థించగా.. అప్పుడు కూడా న్యాయస్థానం దీన్ని తోసి పుచ్చింది. సుప్రీంకోర్టు తాజా నిర్ణయంతో రాణా అప్పగింతకు లైన్ క్లియర్ అయ్యింది.


తహవూర్ రాణా రాక నేపథ్యంలో అధికారులు.. ఢిల్లీ, ముంబైలోని రెండు జైళ్లలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇండియా వచ్చిన తర్వాత.. అతడు కొన్ని వారాల పాటు.. ఎన్ఐఏ కస్టడీలో ఉండనున్నాడని సమాచారం. కొన్ని రోజుల పాటు ఎన్ఐఏ అధికారులు తహవూర్ రాణాని విచారించనున్నారు. రాణా అరెస్ట్ గురించి 2020లోనే ఇండియా.. అమెరికాను అభ్యర్థించింది. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో రాణా అప్పగింతపై ట్రంప్ కీలక ప్రకటన చేశాడు. అతడిని భారత్‌కు అప్పగిస్తామని.. అక్కడే అతడికి శిక్ష విధిస్తారని వెల్లడించాడు. అలానే మరికొందరు నిందితులను కూడా భారత్‌కు అప్పగిస్తామని ట్రంప్ హామీ ఇచ్చాడు. ఆ మేరకు తాజాగా రాణాను ఇండియాకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నాడు.


తహవూర్ రాణా విషయానికి వస్తే.. అతడు పాకిస్తాన్‌కు చెందిన కెనడా జాతీయుడు. లష్కరే ఈ తోయిబాలో చురుగ్గా ఉండేవాడు. ప్రస్తుతం అతడు లాస్ ఏంజిల్స్‌లోని జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. అమెరికా సుప్రీం కోర్టు తీర్పుతో తహవూర్ రాణాని ఇండియాకు తరలించేందుకు మార్గం సుగమం అయ్యింది. ఈ క్రమంలో భారత అధికారులు బృందం అమెరికా వెళ్లి.. అవసరమైన పత్రాలు సమర్పించింది. చట్టపరైన ప్రక్రియ ముగియడంతో.. అమెరికా.. తహవూర్‌ని ఇండియాకు అప్పగించినట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి:

లవర్‌తో పట్టుబడ్డ భార్య.. నిలదీస్తే.. నీకు నేవీ ఆఫీసర్ గతే పడుతుందంటూ

Ice Cream: ఫ్లేవర్‌ గుర్తిస్తే రూ. 3లక్షలు మీవే..

Updated Date - Apr 09 , 2025 | 11:42 AM