Tamilnadu: ఈరోడ్ ఈస్ట్ ఉపఎన్నికను బాయ్‌కాట్ చేసిన ఎన్డీయే
ABN, Publish Date - Jan 12 , 2025 | 09:04 PM
ఈరోడ్ ఈస్ట్ ఉప ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షమైన అన్నాడీఎంకే, డీఎండీకే ప్రకటించగా, తాజాగా బీజేపీ కూడా ఎన్నికలను బాయ్‌కాట్ చేస్తున్నట్టు ప్రకటించింది.
చెన్నై: తమిళనాడులోని ఈరోడ్ ఈస్ట్ (Erodo East) ఉపఎన్నికను బాయ్‌కాట్ చేయాలని బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే (NDA) నిర్ణయించింది. ఫిబ్రవరి 5న ఈ నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరుగనుంది. 2002లో ఈరోడ్ ఈస్ట్ ఉప ఎన్నిక జరుగగా, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఈవీకేఎస్ ఇలాంగోవన్ మృతితో మళ్లీ ఇక్కడ ఉపఎన్నిక జరుగుతోంది. ఇది "ఉపఎన్నిక కోసం జరుగుతున్న ఉపఎన్నిక'' అని, ఈ ఎన్నికల్లో పోటీ చేయరాదని ఎన్డీయే నిర్ణయించిందని రాష్ట్ర బీజేపీ విభాగం అధ్యక్షుడు అన్నామలై (Annamalai) తెలిపారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే పాలనకు ఉద్వాసన పలకడమే లక్ష్యంగా తాము దృష్టి సారించనున్నట్టు చెప్పారు.
Bangladesh: సరిహద్దు ఉద్రిక్తతలపై భారత రాయబారికి బంగ్లాదేశ్ సమన్లు
పోటీ లేకుండానే..
ఉప ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షమైన అన్నాడీఎంకే, డీఎండీకే ప్రకటించగా, తాజాగా బీజేపీ కూడా ఎన్నికలను బాయ్‌కాట్ చేస్తున్నట్టు ప్రకటించింది. దీంతో డీఎంకే కూటమి తరఫున ఆ పార్టీ నామినేట్ చేసిన వీసీ చంద్రకుమార్ మాత్రమే పోటీలో ఉన్నారు. డీఎంకే కూటమిలో కాంగ్రెస్ భాగస్వామిగా ఉంది.
2026లో డీఎంకేకు ఉద్వాసన
''ప్రజాసంక్షేమం దృష్ట్యా ఎన్డీయే నేతలంతా సంప్రదించుకుని ఈరోస్ట్ ఈస్ట్ ఉపఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నారు. 2026 ఎన్నికల్లో డీఎంకేను గద్దె దింపడం, ఎన్డీయే పాలనను ప్రజలకు అందించడమే మా అందరి లక్ష్యం'' అని అన్నామలై తెలిపారు. డీఎంకే ప్రభుత్వం రాష్ట్రాన్ని చీకట్లోకి నెట్టేసిందని, సమాజంలోనే వివిధ వర్గాలకు భద్రత లేదని, ఇది ప్రజా వ్యతిరేక ప్రభుత్వమని, శాంతిభద్రతలు విఫలమయ్యాయని ఆయన ఆరోపించారు.
ఇవి కూడా చదవండి..
Hero Vijay: హీరో విజయ్ అంతమాట అనేశారేంటో.. ఆయన ఏమన్నారో తెలిస్తే..
Chief Minister: నాన్న అనే ఆ పిలుపే మా పాలనకు కితాబు
Read Latest National News and Telugu News
Updated Date - Jan 12 , 2025 | 09:04 PM