Share News

Elephants: అడవి ఏనుగులను తరిమేందుకు గుంకీ ఏనుగుల రాక

ABN , Publish Date - Jan 05 , 2025 | 02:21 PM

వ్యవసాయ భూములను ధ్వంసం చేస్తున్న అడవి ఏనుగులను బంధించేందుకు రెండు గుంకీ ఏనుగులు(Elephants) రంగంలో దిగాయి. దిండుగల్‌ జిల్లా నీలమలకోట, కినత్తుపట్టి, కొంబై(Neelamalakota, Kinathupatti, Kombai) తదితర గ్రామాల్లో రైతులు వరి సహా పలురకాల పంటలు, అరటి తదితరాలు సాగుచేస్తున్నారు.

Elephants: అడవి ఏనుగులను తరిమేందుకు గుంకీ ఏనుగుల రాక

చెన్నై: వ్యవసాయ భూములను ధ్వంసం చేస్తున్న అడవి ఏనుగులను బంధించేందుకు రెండు గుంకీ ఏనుగులు(Elephants) రంగంలో దిగాయి. దిండుగల్‌ జిల్లా నీలమలకోట, కినత్తుపట్టి, కొంబై(Neelamalakota, Kinathupatti, Kombai) తదితర గ్రామాల్లో రైతులు వరి సహా పలురకాల పంటలు, అరటి తదితరాలు సాగుచేస్తున్నారు. ఈ గ్రామాల పైతట్టు ఉన్న పశ్చిమ కనుమల కొండల నుంచి వస్తున్న ఏనుగుల ముంపు పొలాల్లో ప్రవేశించి పంటలు ధ్వంసం చేస్తున్నాయి.

ఈ వార్తను కూడా చదవండి: Jallikattu: రంకేసిన తొలి జల్లికట్టు..


nani4.jpg

అడవి ఏనుగులు ఈ ప్రాంతాల్లోకి రాకుండా చర్యలు చేపట్టాలని గ్రామస్తులు అటవీ శాఖకు విజ్ఞప్తి చేశారు. దీంతో, పునరావాస కేంద్రంలో సంరక్షిస్తున్న రెండు గుంకీ ఏనుగులను ఆ ప్రాంతానికి రప్పించిన అటవీ శాఖ సిబ్బంది, అడవి ఏనుగులను బంధించడం, దూర ప్రాంతాలకు తరలించే పనులు చేపట్టారు.


ఈవార్తను కూడా చదవండి: ‘తెలుగు‘లో చదివితే ఉద్యోగాలు రావన్నది అపోహే

ఈవార్తను కూడా చదవండి: KTR: కేంద్రంలో చక్రం తిప్పుతాం

ఈవార్తను కూడా చదవండి: DK Aruna: చట్టసభల్లో మహిళల సంఖ్య పెరగాలి

ఈవార్తను కూడా చదవండి: ఖమ్మం అభివృద్ధిపై మంత్రి తుమ్మల కీలక నిర్ణయాలు

Read Latest Telangana News and National News

Updated Date - Jan 05 , 2025 | 02:22 PM