Chennai: విజయ్ పార్టీతో డీఎంకే కూటమికి నష్టం లేదు
ABN, Publish Date - Jan 02 , 2025 | 11:54 AM
హీరో విజయ్(Hero Vijay) స్థాపించిన తమిళగ వెట్రి కళగం (టీవీకే)తో డీఎంకే కూటమికి ఎలాంటి నష్టం లేదని ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో అభిప్రాయపడ్డారు.
చెన్నై: హీరో విజయ్(Hero Vijay) స్థాపించిన తమిళగ వెట్రి కళగం (టీవీకే)తో డీఎంకే కూటమికి ఎలాంటి నష్టం లేదని ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో అభిప్రాయపడ్డారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ, డీఎంకే కూటమిలో ఎలాంటి విభేదాలు లేవని, మేమంతా ఐకమత్యంతోనే ఉన్నామన్నారు. విజయ్ రాజకీయాల్లోకి రావడం వల్ల డీఎంకే(DMK) కూటమికి ఎలాంటి నష్టం లేదన్నారు. తాను ఉన్నంతవరకు డీఎంకే ప్రభుత్వం పడిపోవడాన్ని అంగీకరించమన్నారు. డీఎంకే కూటమికి హాని చేసే పార్టీ లేదా కూటమిలో చేరబోనని స్పష్టం చేశారు.
ఈ వార్తను కూడా చదవండి: Chennai: అవయవదానంపై పెరుగుతున్న అవగాహన
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అన్నామలై(BJP state president K. Annamalai) వ్యాఖ్యలు, కొరడాతో కొట్టుకోవడం వంటి చర్యలు చూసి ఆనందించేందుకు చాలా బాగున్నాయన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసేలా ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister Stalin) కొత్త కొత్త సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం దశలవారీగా అణిచివేసేందుకు ప్రయత్నిస్తుందన్నారు. ఇలాంటి చర్యలు భారత ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించగలవా అనే సందేహం కలుగుతుందని వైగో పేర్కొన్నారు.
ఈవార్తను కూడా చదవండి: Hyderabad Metro: మేడ్చల్.. శామీర్‌పేటకు మెట్రో!
ఈవార్తను కూడా చదవండి: రైతు భరోసాపై మంత్రి కోమటిరెడ్డి కీలక ప్రకటన
ఈవార్తను కూడా చదవండి: పోలీసులకు సవాల్‌గా మారిన ముగ్గురు మృతి కేసు
ఈవార్తను కూడా చదవండి: తాటిబెల్లం తింటే...
Read Latest Telangana News and National News
Updated Date - Jan 02 , 2025 | 11:56 AM