Mumbai Dubai in 2 hours: ముంబై టూ దుబాయ్.. 2 గంటల్లోనే.. ఎలా సాధ్యమంటే
ABN , Publish Date - Apr 09 , 2025 | 01:51 PM
ముంబై నుంచి దుబాయ్‌కి కేవలం 2 గంటల్లో చేరుకోవచ్చు.. అది కూడా విమానంలోకాదు. రైలులో. వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా ఇది మాత్రం వాస్తవం అని.. భవిష్యత్తులో జరగబోయేది ఇదే అంటున్నారు. మరి ఇది ఎలా సాధ్యం అంటే..

ముంబై: మారుతున్న కాలం, పెరుగుతున్న సాంకేతికత వల్ల మన జీవితంలోకి అనేక సౌకర్యాలు వచ్చి చేరాయి. ఒకప్పుడు ప్రయాణాలు చేయాలంటే కాలి నడకన వెళ్లాల్సి వచ్చేది. తర్వాత కాలంలో ఎడ్ల బండ్లు, బస్సులు, రైలు, విమానాలు వంటి మార్గాలు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఇప్పటికి కూడా విదేశాలకు ప్రయాణం చేయాలంటే.. గంటల సమయం పడుతుంది. అయితే సాంకేతికత పెరుగుతున్న కొద్ది.. ప్రయాణ సమయం తగ్గనుంది అంటున్నారు నిపుణులు. ఇందుకు అనేక ఉదాహరణలు కూడా చెబుతున్నారు. ఇప్పుడు ఈ కోవకు చెందిన మరోక వార్త వెలుగులోకి వచ్చింది. భవిష్యత్తులో ముంబై నుంచి దుబాయ్‌కి కేవలం 2 గంటల వ్యవధిలోనే.. అది కూడా రైలులో ప్రయాణం చేసి చేరుకోవచ్చు. మరి అది ఎలా సాధ్యం అంటే..
ముంబై టూ దుబాయ్ కేవలం రెండు గంటల్లోనే అది కూడా విమానంలో కాదు.. ట్రైన్‌లో అంటే వినడానికి కాస్త ఆశ్చర్యంగానే అనిపిస్తుంది. కానీ భవిష్యత్తులో ఇదే నిజం కానుంది అంటున్నారు నిపుణులు. ఇండియా, యూఏఈల మధ్య.. 2 వేల కిలోమీటర్ల అండర్‌వాటర్ రైల్ లింక్ మెగా ప్రాజెక్ట్‌ను ప్రపోజ్ చేశారు. ఇది పూర్తయితే ముంబై నుంచి దుబాయ్‌కి కేవలం రెండు గంటల్లోనే.. అది కూడా రైల్లో చేరుకోవచ్చు.
ఈ అండర్ వాటర్ ట్రైన్.. గంటకు 600-1000 కిలోమీటర్ల స్పీడ్‌తో పరుగులు తీయనుందట. ఇక ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే.. ప్రముఖ నగరాల మధ్య ప్రయాణ సమయం చాలా వరకు తగ్గుతుంది అని భావిస్తున్నారు. కేవలం 2 గంటల వ్యవధిలోనే ఏ నగరానికి అయినా చేరుకోవచ్చట. ఈ అండర్ వాటర్ హై స్పీడ్ రైలు ప్రాజెక్ట్‌ని యూఏఈ నేషనల్ అడ్వైజరీ బ్యూరో లిమిటెడ్ ప్రతిపాదించింది. ఇండియా-యూఏఈ ఇరు దేశాల మధ్య ప్రయాణ సౌకర్యాలను మెరుగుపర్చడమే కాక.. వ్యాపార సంబంధాలు పెంచాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్‌ను ప్రతిపాదించారు.
ఇక ఈ రైలులో కేవలం ప్రయాణికులు మాత్రమే కాక.. క్రూడ్ ఆయిల్, ఇతర వస్తువులను కూడా రవాణా చేయవచ్చని తెలుస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వాలంటే భారీగా నిధులు ఖర్చు చేయాల్సి వస్తుందని అంటున్నారు అధికారులు. ఈ ప్రాజెక్ట్‌పై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. అన్ని అనుకూలించి.. అనుమతులు లభిస్తే.. అతి త్వరలోనే అంటే 2030 నాటికి ఈ ప్రాజెక్ట్ పూర్తి కానుందంటున్నారు. ఇది విజయవంతమైతే.. ప్రపంచంలోనే అత్యంత అడ్వాన్స్‌డ్ ట్రాన్స్‌పోర్ట్ వ్యవస్థల్లో ఒకటిగా చేరుతుంది అంటున్నారు అధికారులు.
ఇవి కూడా చదవండి:
Tamannaah: పాపం.. ఆ లేడీ కానిస్టేబుల్ క్రేజ్ ముందు తమన్నా వెలవెలబోయింది
Vehicle Ban: ప్రభుత్వం సంచలన నిర్ణయం..ఆ వాహనాలపై నిషేధం