Udayanidhi: పూర్తి రాష్ట్ర స్వయంప్రతిపత్తి సాధించుకుందాం..
ABN , Publish Date - Apr 16 , 2025 | 12:00 PM
తమిళనాడుకు రాష్ట్ర హోదా కోసం ప్రజాస్వామ్య యుద్ధభూమిలో డీఎంకే ప్రభుత్వం దృఢంగా నిలుస్తుందని ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్పష్టం చేశారు. కేంద్రంలో ఉన్న వారు రాష్ట్ర అధికారాలను చేజిక్కించుకుంటున్న సమయంలో, తమిళనాడు తన గొంతు బలంగా వినిపిస్తూనే ఉంటుందన్నారు.

- ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి
చెన్నై: రాష్ట్ర హోదా కోసం ప్రజాసామ్య యుద్ధభూమిలో డీఎంకే(DMK) ప్రభుత్వం దృఢంగా నిలుస్తుందని ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి(Dy Chief Minister Udayanidhi) స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన తన ‘ఎక్స్’ పేజీలో పోస్ట్ చేసిన వివరాలిలా ఉన్నాయి... 50 ఏళ్ల క్రితం కలైంజర్ కరుణానిధి శాసనసభలో రాష్ట్ర స్వయంప్రతిపత్తి తీర్మానం ఆమోదించారని, ఆ చరిత్ర మళ్లీ పునరావృతం కానుందన్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Vijay: 234 నియోజకవర్గాల్లో విజయ్ సేన సర్వే
శాసనసభలో 110వ నిబంధన కింద ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Chief Minister MK Stalin) రాష్ట్ర స్వయంప్రతిపత్తి సాధించేందుకు చారిత్రాత్మక ప్రకటన చేశారన్నారు. రాష్ట్ర హక్కులు పరిరక్షించేలా మాజీ న్యాయమూర్తి కురియన్ జోసఫ్ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారన్నారు. కేంద్రంలో ఉన్న వారు రాష్ట్ర అధికారాలను చేజిక్కించుకుంటున్న సమయంలో, తమిళనాడు తన గొంతు బలంగా వినిపిస్తూనే ఉంటుందన్నారు.
ముఖ్యమంత్రి ఈ ప్రకటన చేయడానికి ముందే అన్నాడీఎంకే(AIADMK) సభ్యులు వాకౌట్ చేసి, కోలుకోలేని కళంకానికి గురయ్యారన్నారు. బీజేపీ సభ్యులు కూడా వాకౌట్ చేసి తమ యజమానుల పట్ల బానిసలుగా విధేయత ప్రదర్శించారని ఉప ముఖ్యమంత్రి విమర్శించారు.
ఈ వార్తలు కూడా చదవండి
అలా అయితే.. రాజకీయాల నుంచి తప్పుకుంటా..
Read Latest Telangana News and National News