Ayodhya: రామ్‌లల్లాను దర్శించుకున్న 2 లక్షల మంది భక్తులు
ABN, Publish Date - Jan 01 , 2025 | 09:55 PM
కొత్త సంవత్సరం తొలిరోజున 2 లక్షల మందికి పైగా భక్తులు భవ్య రామమందిరంలోని రామ్‌లల్లాను దర్శించుకున్నట్టు జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు బుధవారంనాడు తెలిపింది.
అయోధ్య: అయోధ్యలోని రామ్‌లల్లా ఆలయానికి భక్తులు బుధవారంనాడు పోటెత్తారు. కొత్త సంవత్సరం తొలిరోజున 2 లక్షల మందికి పైగా భక్తులు భవ్య రామమందిరంలోని రామ్‌లల్లాను దర్శించుకున్నట్టు జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు బుధవారంనాడు తెలిపింది. ఉదయం 7 గంటలకు దర్శనం మైదలైందని, భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఐదు క్యూలలో రామ్‌లల్లా దర్శనానికి వీలుకల్పించామని పేర్కొంది. 2 లక్షల మందికి పైగా భక్తులు ఇప్పటికే దర్శించుకున్నారని, రాత్రి 9 గంటల వరకు దర్శనం కొనసాగిస్తున్నందున భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.
India-Pakistan: అణు స్థావరాల జాబాతాను మార్చుకున్న భారత్-పాక్
అయోధ్యలోని భవ్య రామాలయానికి డిసెంబర్ 31 నుంచే వేలాది మందిభక్తులు తరలి వచ్చారు. ఏడాది చివరి రోజున జరిగే చిట్టచివరిని హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా, కొత్త సంవత్సరం తొలిరోజు దేశంలోని ప్రఖ్యాత ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. దేశరాజధాని ఢిల్లీలో వాతావరణ ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ ఉదయం నుంచి భక్తులు కన్నాట్ ప్లేస్‌లోని ప్రఖ్యాత ప్రాచీన్ హనుమాన్ మందిర్‌కు పోటెత్తారు. కల్కాజీ టెపుల్, ఛాత్రపూర్ టెంపుల్, బిర్లా మందిర్‌లో ప్రభాత హారతికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. వారణాసిలో భక్తులు గంగా హారతికి పెద్దఎత్తున హాజరయ్యారు. మధురలోని బంకీ బిహారీ ఆలయంలోనూ భక్తులు ప్రత్యేక పూజాకార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం, మదురైలోని మీనాక్షి ఆలయం, హర్యానాలోని పంచకులలో మాతా మనాస దేవి ఆలయం, గౌహతిలోని కామాక్ష టెంపుల్‌కు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో భక్తులు పవిత్ర గంగాస్నానాలకు పోటెత్తారు. పంజాబ్‌లోని అమృత్‌సర్ ఆలయంలోనూ భక్తులతో సందడి నెలకొంది.
ఇవి కూడా చదవండి..
PM Kisan Scheme : 6 వేలు కాదు.. 10 వేలు
UP: యూపీలో దారుణం.. ఐదుగురు మహిళల హత్య
Read More National News and Latest Telugu News
Updated Date - Jan 01 , 2025 | 09:56 PM