Uttar Pradesh: డ్రోన్ షో మామూలుగా లేదుగా.. రిహార్సల్సే ఇలా ఉందంటే.. ఇక..
ABN , Publish Date - Jan 24 , 2025 | 10:03 AM
ఉత్తర్ ప్రదేశ్: ప్రయాగ్ రాజ్‌లో మహాకుంభమేళ అంగరంగ వైభవంగా సాగుతోంది. కోట్ల మంది భక్తులు ప్రయాగ్ రాజ్‌కు చేరుకుని గంగానదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. 45 రోజులపాటు సాగే మహాకుంభమేళాకు ఇప్పటికే దేశవిదేశాల నుంచి కోట్ల మంది భక్తులు వచ్చి గంగాదేవి, శివయ్యను భక్తిశ్రద్ధలతో పూజించారు.

ఉత్తర్ ప్రదేశ్: ప్రయాగ్ రాజ్‌లో మహాకుంభమేళ అంగరంగ వైభవంగా సాగుతోంది. కోట్ల మంది భక్తులు ప్రయాగ్ రాజ్‌కు చేరుకుని గంగానదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. 45 రోజులపాటు సాగే మహాకుంభమేళాకు ఇప్పటికే దేశవిదేశాల నుంచి కోట్ల మంది భక్తులు వచ్చి గంగాదేవి, శివయ్యను భక్తిశ్రద్ధలతో పూజించారు. ఇంకా కోట్ల మంది భక్తులు రానున్నారు. ఈ నేపథ్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉత్తర్ ప్రదేశ్ యోగి సర్కార్ భారీ ఏర్పాట్లు చేసింది.
అయితే జనవరి 24 నుంచి 26 వరకూ మహాకుంభమేళాలో డ్రోన్ షో నిర్వహించాలని ఉత్తర్ ప్రదేశ్ టూరిజం డిపార్ట్‌మెంట్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన రిహార్సల్స్‌ను మహాకుంభ్ నగర్‌లోని సెక్టార్-7లో నిన్న (గురువారం) రాత్రి అధికారులు నిర్వహించారు. ఈ ప్రదర్శన అక్కడి భక్తులను మంత్రుముగ్ధులను చేసింది. ప్రదర్శన సమయంలో ఒకేసారి వేల డ్రోన్‌లు ఆకాశంలో కనిపించాయి. మిరిమిట్లు గొలుపుతూ ఆకర్షణీంగా వివిధ ఆకారాల్లో భక్తులకు కనువిందు చేశాయి. ఈ ప్రదర్శన భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికత వెల్లువిరిసేలా కనిపించింది. ఈ ప్రదర్శన కుంభమేళాకు వెళ్లిన భక్తులను ఎంతోగానో ఆకట్టుకుంది.
హిందూ దేవుళ్లు, మహాకుంభమేళాకు సంబంధించిన వివిధ ఆకృతులను డ్రోన్ షోలో అధికారులు ప్రదర్శించారు. అందమైన విద్యుత్ కాంతులు, సంగీతం మధ్య అద్భుతమైన సమన్వయంతో డ్రోన్లు ఎగరవేయగా.. లక్షలాది మంది భక్తులు, పర్యాటకులు వాటిని తిలకించారు. రిహార్సల్సే ఇలా ఉన్నాయంటే నిజమైన డ్రోన్ షో ఎలా ఉంటుందోనని భక్తులు ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. మూడ్రోజులపాటు నిర్వహించే డ్రోన్ షో సజావుగా జరిగేందుకు అధికారులు పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టారు. స్థానిక పరిపాలన, పోలీస్, పర్యాటక శాఖ అధికారులు వేదిక వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రిహార్సల్స్ నిర్వహించారు.
మరోవైపు మహాకుంభమేళాలో గురువారం జరిగిన పూజా కార్యక్రమాల్లో విదేశీ భక్తులు సైతం పెద్దఎత్తున సందడి చేశారు. రష్యా, ఉక్రెయిన్ నుంచి వచ్చిన సాధువులు మహాకుంభమేళాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పుణ్యస్నానాలు ఆచరించి సంప్రదాయ వస్త్రాలు ధరించారు. హిందూ ఆచారాలు పాటిస్తూ భక్తి గీతాలు ఆలపించి భక్తి పారవశ్యంలో మునిగితేలారు. సనాతన ధర్మంపై పాశ్చాత్యులకు నమ్మకం పెరిగిందని, వారంతా హిందూ సంప్రదాయాలపై మక్కువ చూపించడం ఎంతో సంతోషంగా ఉందని పలువురు భక్తులు చెబుతున్నారు.