Share News

MK Stalin: గవర్నర్లపై సుప్రీం తీర్పు అన్ని రాష్ట్రాలకు పెద్ద విజయం

ABN , Publish Date - Apr 08 , 2025 | 03:04 PM

సుప్రీంకోర్టు నుంచి తమిళనాడు ప్రభుత్వానికి లభించిన ఊరటపై అసెంబ్లీలో స్టాలిన్ మాట్లాడుతూ, సుప్రీంకోర్టు తీర్పుతో గవర్నర్ నిలిపి ఉంచిన బిల్లులన్నీ ఇప్పుడు ఆయన ఆమోదముద్ర పడి చట్టరూపం దాలుస్తాయని చెప్పారు.

MK Stalin: గవర్నర్లపై సుప్రీం తీర్పు అన్ని రాష్ట్రాలకు పెద్ద విజయం

చెన్నై: రాష్ట్ర బిల్లులపై గవర్నర్ పాత్రకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకమని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) అభివర్ణించారు. ఈ తీర్పు కేవలం తమిళనాడుకు మాత్రమే పరిమితం కాదని, ఇది అన్ని రాష్ట్రాలు సాధించిన విజయమని అన్నారు. సుప్రీంకోర్టు నుంచి తమిళనాడు ప్రభుత్వానికి లభించిన ఊరటపై అసెంబ్లీలో స్టాలిన్ మాట్లాడుతూ, సుప్రీంకోర్టు తీర్పుతో గవర్నర్ నిలిపి ఉంచిన బిల్లులన్నీ ఇప్పుడు ఆయన ఆమోదముద్ర పడి చట్టరూపం దాలుస్తాయని చెప్పారు. అసెంబ్లీ రెండోసారి ఆమోదించిన బిల్లులను గవర్నర్ కాదనలేరని రాజ్యాంగం చెబుతోందని, అయితే ఆయన అందుకు విరుద్ధంగా వ్యవహరించడంతో పాటు, ఎడతెగని జాప్యం చేస్తూ వచ్చారని తెలిపారు.

Supreme Court: తమిళనాడు గవర్నర్‌ ఆర్ ఎన్ రవికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ


అసెంబ్లీ ఆమోదించిన పదికి పైగా బిల్లులను గవర్నర్ ఆర్ఎన్ రవి అడ్డుకుంటున్నారని, నిరవధికంగా జాప్యం చేస్తున్నారని స్టాలిన్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కీలక బిల్లులు ఆమోదం పొందకపోవడంతో ప్రభుత్వం ఇబ్బందులు పడుతోందని ఆ పిటిషన్‌లో పేర్కొంది. దీనిపై మంగళవారంనాడు విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం సంచలన తీర్పునిచ్చింది. బిల్లులను అసెంబ్లీ రెండోసారి ఆమోదించి పంపినప్పుడు దానిని రాష్ట్రపతి పరిశీలనకు గవర్నర్ పంపడం సరికాదని న్యాయమూర్తులు జేబీ పరిడివాలా, ఆర్.మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. బిల్లులను గవర్నర్ నిరవిధికంగా నిలిపివేయడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. గవర్నర్ చర్య చట్టవిరుద్ధమని, ఏకపక్షమని పేర్కొంటూ తీర్పు వెలువరించింది.


సమాఖ్య స్ఫూర్తిని నిలిపిన తీర్పు

సుప్రీంకోర్టు తీర్పుపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సామాజిక మాధ్యం "ఎక్స్''లో హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయం ఒక్క తమిళనాడుదే కాదని, అన్ని రాష్ట్ర ప్రభుత్వాల విజయమని అన్నారు. రాష్ట్రాలకున్న లెజిస్లేటివ్ హక్కులను పునరుద్ఘాటించే తీర్పు ఇదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేసిన గవర్నర్లు విపక్ష పాలిత రాష్ట్రాల్లో ప్రగతిశీల లెజిస్లేజివ్ సంస్కరణలను అడ్డుపడే సంస్కృతికి ఈ తీర్పు ఫుల్‌స్టాప్ పెట్టిందన్నారు. కేంద్ర, రాష్ట్ర సంబంధాల మధ్య సమతుల్యతను పునరుద్ధించడంలో కీలకమైన తీర్పునిచ్చిన సుప్రీంకోర్టుకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. తమిళనాడు ప్రజలకు, లీగల్ టీమ్‌కు అభినందలు తెలిపారు.


ఇవి కూడా చదవండి..

Supreme Court Closes NTA Case: ఎన్‌టీఏపై కేసును మూసివేసిన సుప్రీంకోర్టు

Heavy Rains: ఈరోడ్‌లో వర్షబీభత్సం.. అరటి తోటలు ధ్వంసం

For National News And Telugu News

Updated Date - Apr 08 , 2025 | 04:16 PM