Share News

CEC Rajiv Kumar: రిటైర్మెంట్ తర్వాత హిమాలయాలకు

ABN , Publish Date - Jan 07 , 2025 | 09:02 PM

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను రాజీవ్ కుమార్ ప్రకటించిన నేపథ్యంలో రిటైర్‌మెంట్ తర్వాత మీ ప్లాన్స్ ఏమిటని మీడియా అడిగినప్పుడు... మీ అందరికీ దూరంగా హిమాలయాల్లోని సుదూర ప్రాంతాలకు వెళ్లి నాలుగైదు నెలలు ఉంటానన్నారు.

CEC Rajiv Kumar: రిటైర్మెంట్ తర్వాత హిమాలయాలకు

న్యూఢిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ (Rajiv Kumar) మంగళవారంనాడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పదవీ విరమణ తర్వాత తన ఆలోచనలు వెల్లడిస్తూ, అనవసర విషయాలను విముక్తి పొందాలనుకుంటున్నానని, హిమాలయాలకు వెళ్లి కొన్ని నెలలు అక్కడే ఉండాలని అనుకుంటున్నానని చెప్పారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను రాజీవ్ కుమార్ ప్రకటించిన నేపథ్యంలో రిటైర్‌మెంట్ తర్వాత మీ ప్లాన్స్ ఏమిటని మీడియా అడిగినప్పుడు... మీ అందరికీ దూరంగా హిమాలయాల్లోని సుదూర ప్రాంతాలకు వెళ్లి నాలుగైదు నెలలు ఉంటానన్నారు.

Delhi Assembly Elections: ఈవీఎం అవకతవకలు, రిగ్గింగ్‌కు తావులేదు: ఈసీ


ఏకాంతం, స్వీయ అధ్యయనం కోసం తనకు కొంత సమయం కావాలని సీఈసీ చెప్పారు. అనవసర అంశాల నుంచి విముక్తి పొందాలనుకుంటున్నట్టు చెప్పారు. ఇదే తాను నిర్వహించే చివరి ఎన్నికలని, ఆఖరి ప్రెస్‌మీట్ అని చెప్పారు. ఫిబ్రవరి 18న రాజీవ్ కుమార్ రిటైర్‌ అవుతున్నారు.


గత ఏడాది అక్టోబర్‌లో ఉత్తరాఖండ్‌లోని పిథోర్‌గఢ్ జిల్లాలోని రాలమ్ అనే మారుమూల గ్రామంలో వాతావరణ ప్రతికూలత కారణంగా రాజీవ్ కుమార్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ అయింది. దీంతో ఆయన అక్కడ చిక్కుకుపోయారు. బీహార్ క్యాడర్‌కు చెందిన 1984 ఐఏఎస్ అధికారి అయిన రాజీవ్‌ కుమార్ 2020 సెప్టెంబర్‌లో ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. 2022 మే 15 నుంచి సీఈసీగా ఉన్నారు.


Nirmala Sitharaman: విశాఖ ఉక్కును విక్రయించొద్దు!

Earthquake: భారత్‌లో భారీ భూకంపం..భయాందోళనలో జనం

Read Latest National News and Telugu News

Updated Date - Jan 07 , 2025 | 09:08 PM