Iftar Party: విజయవాడలో ఇఫ్తార్ విందులో పాల్గొన్న సీఎం చంద్రబాబు

ABN, Publish Date - Mar 27 , 2025 | 09:19 PM

రంజాన్ మాసం సందర్భంగా విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వం ఇఫ్తార్ విందును గురువారం నాడు ఇచ్చింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి ఎన్ ఎండీ ఫరూఖ్, ఎమ్మెల్యేలు, ముస్లిం మత పెద్దలు, ముస్లింవర్గ ప్రజలు పాల్గొన్నారు.

 Iftar Party: విజయవాడలో  ఇఫ్తార్ విందులో పాల్గొన్న సీఎం చంద్రబాబు 1/21

రంజాన్ మాసం సందర్భంగా విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వం ఇఫ్తార్ విందును గురువారం నాడు ఇచ్చింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి ఎన్ఎండీ ఫరూఖ్, ఎమ్మెల్యేలు, ముస్లిం మత పెద్దలు, ముస్లింవర్గ ప్రజలు పాల్గొన్నారు.

 Iftar Party: విజయవాడలో  ఇఫ్తార్ విందులో పాల్గొన్న సీఎం చంద్రబాబు 2/21

ఇఫ్తార్ విందులో పాల్గొన్న సీఎం చంద్రబాబును కలిసేందుకు ముస్లిం సోదరులు పోటీ పడ్డారు.

3/21

సీఎం చంద్రబాబుతో సెల్ఫీలు దిగేందుకు ముస్లిం సోదరులు ఉత్సాహం చూపించారు.

4/21

ప్రతి ఒక్కరినీ అప్యాయంగా పలకరించి.. వారితో కలిసి సీఎం చంద్రబాబు ఫొటోలు దిగారు.

5/21

లోపల ఆడిటోరియం నుంచి బయట ప్రధాన ద్వారం వరకు నడుస్తూనే ముస్లిం సోదరులు ఫొటోలు తీసుకునే వరకు సీఎం చంద్రబాబు ఓపిగ్గా ఉన్నారు.

6/21

రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇఫ్తార్ విందు ఇస్తున్నామని సీఎం చంద్రబాబు ప్రకటించారు.

7/21

కార్యక్రమంలో నమాజ్ చేస్తున్న ముస్లిం సోదరులు

8/21

ముస్లింలతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నమాజ్ చేశారు.

9/21

రంజాన్ పవిత్ర మాసంలో అందరూ కఠినమైన ఆచారాలను పాటిస్తున్నారని సీఎం చంద్రబాబు తెలిపారు.

10/21

సలామాలేకూమ్ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగం ప్రారంభించారు. ఉదయం నుంచి ఖురాన్ చదవడం, ఇతరులకు సహాయం చేయడం వంటి మంచి పనులను ముస్లిం సోదరులు చేస్తున్నారని సీఎం చంద్రబాబు వెల్లడించారు.

11/21

పాజిటీవ్ ఆలోచనలతో.. అందరూ బాగుండాలని ముస్లిం సోదరులు పని చేస్తున్నారని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు.

12/21

నేడు ఖురాన్ నేర్పించిన మంచి గుణం.. డబ్బులున్నవాళ్లు పేదలకు సాయం చేయడమేనని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.

13/21

మొదటి నుంచీ తెలుగుదేశం పార్టీ మైనార్టీలకు అండగా ఉందని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు.

14/21

మైనార్టీల సంక్షేమం కోసం చాలా పథకాలను అమలు చేస్తున్నామని సీఎం చంద్రబాబు వెల్లడించారు.

15/21

పేదల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు.

16/21

నూటికి నూరుశాతం పేదలను పైకి తీసుకొచ్చేందుకే పీ4 కార్యచరణను ఈనెల 30వ తేదీన చేపడుతున్నామని సీఎం చంద్రబాబు ప్రకటించారు.

17/21

పేదరికంలో ఉన్న ప్రతీ ముస్లిం కుటుంబాన్ని ఆర్థికంగా పైకి తీసుకొచ్చి తీరుతామని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.

18/21

వక్ఫ్ బోర్డు ఆస్తులను కాపాడతామని సీఎం చంద్రబాబు చెప్పారు. మత సామరస్యాన్ని కాపాడుతూ మైనార్టీలకు అన్ని విధాలా అండగా ఉంటామని స్పష్టం చేశారు.

19/21

ఉర్థూని రెండో భాషగా గుర్తించటంతో పాటు వక్ఫ్ బోర్డు ఆస్తులను కాపాడుతూ వచ్చామని సీఎం చంద్రబాబు గుర్తుచేశారు.

20/21

హైదరాబాద్, కర్నూల్‌లో ఉర్ధూ విశ్వవిద్యాలయాలు తీసుకొచ్చామని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు.

21/21

అనంతరం ఉండవల్లిలోని తన నివాసానికి సీఎం చంద్రబాబు బయలుదేరి వెళ్లారు.

Updated Date - Mar 27 , 2025 | 10:18 PM