Viral Video: సినిమా వేస్ట్.. థియేటర్లో కొట్టుకున్న స్టార్ హీరో ఫ్యాన్స్
ABN , Publish Date - Apr 15 , 2025 | 07:32 AM
Fans Clash: సత్య థియేటర్‌లో గొడవ చోటుచేసుకుంది. సినిమా అయిపోయిన తర్వాత ‘ సినిమా ఏం బాలేదు’ అని ఓ హీరో ఫ్యాన్స్ అన్నారు. ఈ నేపథ్యంలో గొడవ మొదలైంది. రెండు వర్గాలు థియేటర్లోనే కలబడి కుమ్ముకున్నాయి.

సినిమా వాళ్లను దేవుళ్లుగా భావించటం ఒక్క ఇండియాలోనే జరుగుతుంది. ఫ్యాన్స్ తమ హీరో కోసం ప్రాణాలు ఇచ్చేస్తారు. ఒక చిన్న మాట అన్నా అస్సలు ఊరుకోరు. ఫ్యాన్ వార్‌లో ప్రాణాలు పోగొట్టుకున్న వారు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఫ్యాన్స్‌ను ఒక్కటి చేయడానికి హీరోలు కష్టపడుతూనే ఉన్నారు. ఒకరి సినిమా ఫంక్షన్లకు ఒకరు వెళుతున్నారు. తామంతా ఒక్కటే అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయినా కూడా ఫ్యాన్స్‌లో మార్పు రావటం లేదు. తాజాగా, కేరళలో ఓ ఇద్దరు స్టార్ హీరోల ఫ్యాన్స్ కలబడి కుమ్ముకున్నారు. అది కూడా సినిమా థియేటర్‌లో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.
ఇంతకీ సంగతేంటంటే.. ప్రముఖ తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమా తాజాగా విడుదల అయింది. తమిళంతో పాటు తెలుగు, మలయాళంలో కూడా విడుదలైంది. ఈ నేపథ్యంలో కేరళలోని పాలక్కడ్, సత్య థియేటర్‌లో గొడవ చోటుచేసుకుంది. ఈ సినిమా చూడ్డానికి అజిత్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా.. విజయ్ ఫ్యాన్స్ కూడా వచ్చారు. సినిమా అయిపోయిన తర్వాత ‘ సినిమా ఏం బాలేదు’ అని విజయ్ ఫ్యాన్స్ అన్నారు. దీంతో గొడవ మొదలైంది. మాటల యుద్ధం కాస్తా తర్వాత చేతల యుద్ధంగా మారింది. రెండు వర్గాలు థియేటర్లో అందరూ చూస్తుండగా కలబడి కుమ్ముకున్నారు.
గొడవ తర్వాత బయటకు వచ్చిన విజయ్ ఫ్యాన్స్.. గట్టిగట్టిగా తమ హీరో పేరును అరటం మొదలెట్టారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక, ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు..‘ ఆ హీరోలు ఒకరితో ఒకరు బాగానే ఉంటారు. మధ్యలో మీకేం పోయేకాలంరా బాబు’..‘ ఈ ఫ్యాన్ వార్స్‌కు అడ్డు అదుపు ఉండదు. బరితెగించి ప్రవర్తిస్తున్నారు’..‘ హీరోల కోసం అలా కొట్టుకుంటున్నారే.. మీ తల్లిదండ్రులు చూస్తే ఎంత బాధపడతారు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే, అజిత్ కావచ్చు.. విజయ్ కావచ్చు.. ఫ్యాన్స్ మధ్య గొడవల్ని ఖండిస్తూనే వస్తున్నారు. అజిత్ ఫ్యాన్స్ క్లబ్ వద్దని తేల్చి చెప్పేశాడు.
ఇవి కూడా చదవండి
Today Horoscope: ఈ రాశి వారికి మహాదశ మారిన వెంటనే విజయాలు
Honeytrap: రూ.13 వేల కోట్ల స్కాం.. మెహుల్ చోక్సీ హనీట్రాప్ నిజమా.. కాదా..