Share News

Ayodhya: అయోధ్యలో పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు.. అర్ధ రాత్రిళ్లు కూడా వస్తువులు డెలివరీ చేస్తానంటూ మహిళ ఏజెంట్

ABN , Publish Date - Apr 12 , 2025 | 10:33 PM

అయోధ్యలో భద్రతా ఏర్పాట్లు అద్భుతమంటున్న ఓ యువతి వీడియో ప్రస్తుతం ట్రెండవుతోంది. తాను అర్ధరాత్రి కూడా నిశ్చితంగా వస్తువులు డెలివరీ చేస్తానంటూ ఆ బ్లింకిట్ ఏజెంట్ పేర్కొంది.

Ayodhya: అయోధ్యలో పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు.. అర్ధ రాత్రిళ్లు కూడా వస్తువులు డెలివరీ చేస్తానంటూ మహిళ ఏజెంట్
Ayodhya Blinkit Female Delivery Agent

ఇంటర్నెట్ డెస్క్: అయోధ్యలో భద్రతా ఏర్పాట్లను ప్రశంసిస్తున్న మహిళా డెలివరీ ఏజెంట్ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. రాత్రి షిఫ్టుల్లో కూడా పని చేసేందుకు అనువైన నగరం అయోధ్య అంటూ యువతి ప్రశంసలు కురిపించింది. దీంతో ఈ వీడియోకు నెట్టింట పెద్ద ఎత్తున స్పందన వస్తోంది.

దీప్ పేరిట ఉన్న ఇన్‌స్టా అకౌంట్‌లో ఈ వీడియో షేర్ చేశారు. వీడియోలోని యువతి బ్లింకిట్ డెలివరీ ఏజెంట్‌గా పనిచేస్తోంది. రాత్రి షిఫ్టుల్లో పనిచేయడం భద్రతా పరమైన సమస్యలు తెచ్చి పెడుతుంది కదా అని ఓ వ్యక్తి ఆమెను ప్రశ్నించారు. అలాంటిదేమీ లేదని యువతి నమ్మకంగా చెప్పింది. తాను అయోధ్యలో ఎంతో భద్రంగా ఉన్నట్టు ఫీలవుతానని చెప్పింది. రాత్రిళ్లు కూడా వస్తువులను డెలివరీ చేస్తానని వెల్లడించింది. ‘‘ఈమె అయోధ్యలో అర్ధరాత్రి కూడా పని చేస్తుంటుంది. బ్లింకిట్ ఆర్డర్లను డెలివరీ చేస్తుంటుంది. ఈమె వయసు కేవలం 18’’ అని సదరు వ్యక్తి ఆశ్చర్యం వ్యక్తం చేశారు.


దీనికి ఆమె తడుముకోకుండా సమాధానం ఇచ్చింది. ‘‘మహిళ భద్రత గురించి అయోధ్యలో చింతే అవసరం లేదు. ప్రతి వంద మీటర్లకు ఓ పోలీస్ పెట్రోలింగ్ వాహనం ఉంటుంది. నేను సురక్షితంగా ఇంటికి వెళతాను. మా తల్లిదండ్రులకు కూడా బెంగ పెట్టుకోవడం మానేశారు’’ అని ఆమె తెలిపింది

ఒకప్పుడు నగర వీధులన్నీ నిర్మానుష్యంగా ఉండేవని, ఘాట్ రోడ్‌లు భద్రంతా అనిపించేవి కావని పేర్కొంది. కానీ ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయిందని తెలిపింది. తాను ప్రతి రోజూ ఓకే మార్గంలో పనిచేస్తానని కూడా తెలిపింది. ఒకప్పుడు ఉన్నట్టు ఇప్పుడు పరిస్థితులు లేనేలేవని వెల్లడించింది.


రామ్ మందిర్ నిర్మాణం తరువాత అయోధ్య సమూలంగా మారిపోయిన విషయం తెలిసిందే. నగరంలో కొత్త ఎయిర్‌పోర్టు కూడా ఏర్పాటు చేశారు. రైల్వే స్టేషన్‌ను ఆధునికీకరించారు. దీంతో, కోట్ల మంది భక్తులకు రాముల వారి దర్శనం సునాయాసంగా జరుగుతోంది.

ఇవి కూడా చదవండి:

లక్ అంటే ఇదీ.. లాటరీలో రూ.43 లక్షల.. ఆపై మరో 86 లక్షల గెలుపు

అర్ధరాత్రి వేళ విమాన టిక్కెట్లు బుక్ చేస్తే తక్కువ ధర..

షాకింగ్ వీడియో.. తల్లీకూతుళ్లను నడిరోడ్డు మీద జుట్టు పట్టి ఈడూస్తూ..

Read Latest and Viral News

Updated Date - Apr 12 , 2025 | 10:33 PM